గత కొన్ని నెలల నుంచి బంగారం, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పెరుగుతున్న ధరలకు సామాన్యుడు డీలా పడుతున్నాడు. వీటిపై ఎన్ని రాస్తారోకోలు, ధర్నాలు చేసినా ప్రభుత్వాలకు చీమ కుట్టినట్లు కూడా అనిపించడం లేదు. అయితే ప్రస్తుతం వాటి ధరలు దాదాపు తగివస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ముఖ్యంగా పెట్రోలో ధరల్లో చిన్నపాటి మార్పులు కనపడుతున్నాయి.
బంగారం, వంట గ్యాస్ ధరల్లో స్థిరంగా కనిపిస్తున్నప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరలు గత రెండు రోజుల నుంచి పెరగడం లేదు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో మార్పుల వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు ఏర్పడ్డాయి.
తాజాగా ధరల వివరాలు చూస్తే.. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.26గా ఉంది. డీజిల్ ధర రూ.96.69 గా ఉంది. నిన్నటి పోల్చితే ఆ ధరలో 0.25 పైసలు తేడా కనిపించింది. అయితే మెట్రో నగరంలో కాకుడా జిల్లాల్లో వాటి ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. కరీంనగర్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.13గా ఉంది. లీటర్ డీజిల్ ధర ధర రూ.96.56 గా ఉంది.
ఇదిలా ఉండగా.. దేశ రాజధాని ఢిల్లీ లీటర్ పెట్రోల్ ధర.. హైదరాబాద్ లో ఉన్న ధరల కంటే రూ. 5 తక్కువగా ఉంది. అంటే అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 101.19 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 88.62 లకు లభిస్తోంది. అంటే తెలుగు రాష్ట్రాల్లో కాకుండా దేశ రాజధాని ఢిల్లీలో వీటి ధరలు తగ్గాయనే చెప్పవచ్చు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…