స్పెయిన్ కి చెందిన ప్రముఖ చిత్రకారుడు పికాసో పెయింటింగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా ఇతని పెయింటింగ్స్ కు ఎంత డిమాండ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. తాజాగా పికాసో పెయింటింగ్స్ మరోసారి వార్తల్లో నిలిచింది. మామూలుగానే పికాసో గీసిన చిత్రాలు వంద కోట్లకు పైనే ఉంటాయి. తాజాగా అలాంటి చిత్రం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పికాసో 1932 లో గీసిన మేరీ థెరిసె(కిటికీ వద్ద కూర్చుని ఉన్న యువతి) పెయింటింగ్‌కి భారీ ధర పలికింది. ఈ పెయింటింగ్ ని న్యూయార్క్‌కి చెందిన క్రిస్టైన్స్ సంస్థ గురువారం వేలం వేసింది. వేలం ప్రారంభమైన 19 నిమిషాల్లోనే ఈ పెయింటింగ్ ఏకంగా 103.4 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. భారత కరెన్సీ ప్రకారం ఈ పెయింటింగ్ ధర అక్షరాల 758 కోట్లు.
1932 లో గీసిన ఈ పెయింటింగ్ వేలానికి పెట్టినప్పుడు సుమారు 55 మిలియన్ డాలర్లకు అమ్ముడు పోతుందని భావించిన వేలం సంస్థ ఒకేసారి ఈ పెయింటింగ్ 103.4మిలియన్ డాలర్లకు అమ్ముడుపోవడం తమకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించిందని తెలిపారు. ఈ పెయింటింగ్ తో కలిపి పికాసో గీసిన చిత్రాలలో 100 మిలియన్ డాలర్లు మార్క్ దాటిన చిత్రాల సంఖ్య ఐదుకు చేరింది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఈ కరోనా విపత్కర పరిస్థితులలో కూడా ఈ ఆర్ట్ ఇంత ధర పలకడం ఎంతో ఆశ్చర్యంగా ఉందని వేలం వేసిన క్రిస్టైన్స్ పేర్కొంది. కరోనా సమయంలో కూడా కళాపోషణ ఏమాత్రం తగ్గలేదని క్రిస్టైన్స్ సంస్థ సంతోషం వ్యక్తం చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…