కరోనా మహమ్మారి విజృంభణ తరువాత దేశంలో చాలామంది సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి హోం లోన్ లను తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేట్ రంగ బ్యాంకులు తక్కువ వడ్డీకే హోం లోన్ లను మంజూరు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. అయితే హోం లోన్ తీసుకోవాలని అనుకునే వారికి రియల్టీ సంస్థ పిరమాల్ రియల్టీ అదిరిపోయే ఆఫర్ ను తెచ్చింది.
సున్నా వడ్డీకే పిరమాల్ రియల్టీ సంస్థ హోం లోన్ లను ఇస్తోంది. ఫలితంగా లోన్ తీసుకుని కొత్తగా ఇల్లు కొనుగోలు చేసేవారికి ఎటువంటి అదనపు భారం పడదు. గతంలో ఏ రియల్టీ సంస్థ నుంచి ఇటువంటి స్కీమ్ కస్టమర్లకు అందుబాటులోకి రాలేదు. అయితే పిరమాల్ రియల్టీ సంస్థ ఎంపిక చేసిన ప్రాజెక్టులకు మాత్రమే ఈ ఆఫర్ ను ఇస్తుండటం గమనార్హం. పిరమాల్ సంస్థ ప్రీమియం ప్రాజెక్టులకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.
కరోనా మహమ్మరి విజృంభణ, లాక్ డౌన్ నిబంధనల వల్ల దేశంలో గడిచిన కొన్ని నెలల నుంచి కొత్త ఇళ్ల కొనుగోళ్లు భారీగా తగ్గిపోయిన సంగతి తెలిసిందే. అమ్మకాలు తగ్గిపోవడం వల్ల రియల్టీ సంస్థలు ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి. దీంతో రియాల్టీ సంస్థలు కస్టమర్ల కోసం ఇలాంటి కొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ రియల్టీ కంపెనీ నుంచి లోన్ తీసుకున్న వారికి 2022 సంవత్సరం మార్చి వరకు వడ్డీ భారం పడదు.
ఆసక్తి ఉన్నవారు ముందుగానే బుకింగ్ చేసుకునే అవకాశాన్ని సైతం ఈ సంస్థ కల్పిస్తూ ఉండటం గమనార్హం. అయితే ఈ సంస్థకు చెందిన ప్రాజెక్టులలో మాత్రమే కొనుగోలు చేసేవారికి ఈ స్కీమ్ వల్ల ప్రయోజనం చేకూరనుండటంతో సామాన్య కస్టమర్లకు ఈ స్కీమ్ వల్ల పెద్దగా ప్రయోజనం చేకూరదనే చెప్పాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…