మినరల్ వాటర్ అని చెప్పి ఏవేవో కెమికల్స్ కలిపి అమ్ముతున్నారు. వాటిని 20 నుండి 30 రూపాయల ధర చెల్లించి మరీ తాగుతున్నారు. ఈ నీటిని తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడడం సంగతి అటుంచి కొత్త జబ్బులు వస్తున్నాయి. నీటి నుండి మన శరీరానికి కావలసిన కాల్షియం, మినరల్స్, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్, సల్ఫర్ వంటివి తాగే నీరు నుండే అందుతాయి. ఇపుడు మనం తాగే ఈ మినరల్ వాటర్ లో ఏమి ఉండక పోగా అవి మంచి రుచిగా ఉండడానికి, చక్కని రంగు కనిపించడానికి నీళ్లలో రసాయనాలు కలిపి అమ్ముతున్నారు.
వాటిని తాగడం వలన మన శరీరానికి కాల్సియం అందక చిన్న వయసులోనే కాళ్ళు, చేతులు, మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. రోగనిరోధశక్తి తగ్గి, రక్తంలో హిమోగ్లబిన్ తగ్గడం వలన ఎక్కువగా రోగాల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా మనమే మార్పు తీసుకురావాలి. అందుకే ఇప్పడే ప్లాస్టిక్ వాటర్ తాగడం ఆపేయడం మంచింది.
మనకు అందుబాటులో ఉన్న నీటినే కాచి చల్లార్చి తాగడం ఆరోగ్యానికి ఎంతగానో మంచి చేస్తుంది. కాచిన నీటిని రాగి పాత్రలో కానీ మట్టి కుండలో కానీ నిల్వఉంచి ప్రతి రోజూ తాగడం అలవాటు చేసుకోండి. రాగి పాత్ర లేని పక్షంలో మట్టికుండలో ఒక రాగి ముక్కను వేసుకుని ఆనేతిని రోజు త్రాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. ప్రతి గంటకు ఒక గ్లాస్ నీటినీ తీసుకోవడం వలన మన శరరానికి కావాల్సిన నీరు అందుతుంది. ప్రతి రోజూ 4 నుండి 5 లీటర్ల నీటిని ఖచ్చితంగా త్రాగాలి ప్రతి ఒక్కరూ. ఇటువంటి పద్దతులు అలవాటు చేసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…