ప్రమాదం ఎప్పుడు ఎటువైపు నుంచి ముంచుకు వస్తుందో ఎవరికీ తెలియదు. ఇటువంటి సమయంలోనే ఎంతోమంది ఎన్నో ప్రమాదాల బారిన పడుతుంటారు. తాజాగా ఒక రైల్వే ప్లాట్ ఫామ్ పై ఓ వ్యక్తితో కలిసి చిన్నారి నడుచుకుంటూ వెళుతోంది. అకస్మాత్తుగా కాలుజారి రైల్వే పట్టాలపై పడింది. అదే సమయంలో అటుగా రైలు ఎంతో వేగంతో దూసుకొస్తోంది.
ఒక్కసారిగా చిన్నారి రైల్వే పట్టాలపై పడడంతో తనకు తోడుగా వచ్చిన వ్యక్తి గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టాడు. ఇది గమనించిన రైల్వే ఉద్యోగి మయూర్ షెల్కే రైలుకు ఎదురెళ్లి పాప ప్రాణాలను రక్షించేందుకు సాహసం చేశాడు. రైల్వే పట్టాలపై పరుగులు పెడుతూ చిన్నారిని ఫ్లాట్ ఫామ్ మీదకు సురక్షితంగా ఎక్కించి సెకండ్ల వ్యవధిలోనే తను కూడా సురక్షితంగా బయటపడ్డాడు.
మయూర్ షెల్కే మహారాష్ట్రలోని థానే జిల్లా వంగణీ రైల్వే స్టేషన్‌లో పాయింట్స్ మెన్‌గా పనిచేస్తున్నాడు. అయితే శనివారం చిన్నారి ప్లాట్ ఫామ్ పై పడటంతో చిన్నారిని కాపాడేందుకు తన ప్రాణాలను సైతం లెక్క చేయలేదు. ఈ భయంకరమైన దృశ్యం సీసీ కెమెరాలో రికార్డు కావడంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు ఇతని ధైర్యసాహసాలు పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఆయన ధైర్యానికి సెంట్రల్ రైల్వేస్ ముంబై డివిజన్ డీఆర్‌ఎం సహా సిబ్బంది లేచి నిల్చుని చప్పట్లు కొడుతూ అభినందించారు. అదేవిధంగా ఈ వీడియో పై భారత రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పందించి మయూర్ షెల్కే కి అభినందనలను తెలియజేసారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…