జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.. ఇటీవల జరిగిన వకీల్ సాబ్ సినిమా ఫంక్షన్ కు, అంతకుముందు తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ అనంతరం తన సిబ్బంది, సహాయకులందరికీ కరోనా సోకడంతో ఐసోలేషన్ లోకి వెళ్లారు. ఆ తర్వాత నాలుగైదు రోజులకు పవన్ లోనూ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో కరోనా టెస్టు చేయించుకోగా పాజిటివ్ గా తేలింది.మూడ్రోజులుగా కరోనాతో బాధపడుతున్న జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి కరోనా నెగెటివ్ వచ్చినట్లు తెలిసింది.
ఈ రోజు ఉదయం ఆయన హైదరాబాద్‌లోని ట్రినిట్ ఆసుపత్రిలో కోవిడ్ పరీక్ష చేయించుకున్నారు. అందులో ఆయనకు రిపోర్ట్ నెగటివ్ వచ్చినట్లు తెలిసింది. మూడ్రోజుల కిందట పవన్ కళ్యాణ్‌కి అస్వస్థతగా అనిపించడంతో… టెస్టు చేయించుకున్నారు. అందులో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో హైదరాబాద్ దగ్గర్లోని తన వ్యవసాయక్షేత్రంలో డాక్టర్ల సమక్షంలో చికిత్స తీసుకున్నారు. జ్వరంతోపాటు ఊపిరితిత్తుల్లో నిమ్ము ఉందని డాక్టర్లు తెలిపారు. పవన్ కు యాంటీ వైరల్ డ్రగ్స్, అవసరమైనప్పుడు ఆక్సిజన్ ఇచ్చారు. తన ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే అభిమానుల ముందుకు వస్తానని పవన్‌కల్యాణ్ తెలిపారు. అన్నట్లుగానే ఆయనకు తాజాగా కరోనా నెగెటివ్ వచ్చినట్లు తెలిసింది. దీంతో… ఆయన అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు..
ఇక పవన్ కళ్యాణ్ కరోనా బారి నుండి కోలుకోవడంతో అభిమానులు ఆనందాల్లో మునిగిపోయారు.. ఇక మరోవైపు పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం వకీల్ సాబ్ సైతం భారీ వసూళ్లు దిశగా దూసుకుపోతోంది.. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో సందడి చేస్తూ.. ప్రేక్షకులను విశేషముగా ఆకట్టుకుంటోంది…!!
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…