బ్రేకింగ్ న్యూస్ : పవన్ కళ్యాణ్ కి కరోనా నెగెటివ్.. ఆనందంలో అభిమానులు..!!

0
103

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.. ఇటీవల జరిగిన వకీల్ సాబ్ సినిమా ఫంక్షన్ కు, అంతకుముందు తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ అనంతరం తన సిబ్బంది, సహాయకులందరికీ కరోనా సోకడంతో ఐసోలేషన్ లోకి వెళ్లారు. ఆ తర్వాత నాలుగైదు రోజులకు పవన్ లోనూ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో కరోనా టెస్టు చేయించుకోగా పాజిటివ్ గా తేలింది.మూడ్రోజులుగా కరోనాతో బాధపడుతున్న జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి కరోనా నెగెటివ్ వచ్చినట్లు తెలిసింది.

ఈ రోజు ఉదయం ఆయన హైదరాబాద్‌లోని ట్రినిట్ ఆసుపత్రిలో కోవిడ్ పరీక్ష చేయించుకున్నారు. అందులో ఆయనకు రిపోర్ట్ నెగటివ్ వచ్చినట్లు తెలిసింది. మూడ్రోజుల కిందట పవన్ కళ్యాణ్‌కి అస్వస్థతగా అనిపించడంతో… టెస్టు చేయించుకున్నారు. అందులో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో హైదరాబాద్‌ దగ్గర్లోని తన వ్యవసాయక్షేత్రంలో డాక్టర్ల సమక్షంలో చికిత్స తీసుకున్నారు. జ్వరంతోపాటు ఊపిరితిత్తుల్లో నిమ్ము ఉందని డాక్టర్లు తెలిపారు. పవన్ కు యాంటీ వైరల్‌ డ్రగ్స్, అవసరమైనప్పుడు ఆక్సిజన్‌ ఇచ్చారు. తన ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే అభిమానుల ముందుకు వస్తానని పవన్‌కల్యాణ్‌ తెలిపారు. అన్నట్లుగానే ఆయనకు తాజాగా కరోనా నెగెటివ్ వచ్చినట్లు తెలిసింది. దీంతో… ఆయన అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు..

ఇక పవన్ కళ్యాణ్ కరోనా బారి నుండి కోలుకోవడంతో అభిమానులు ఆనందాల్లో మునిగిపోయారు.. ఇక మరోవైపు పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం వకీల్ సాబ్ సైతం భారీ వసూళ్లు దిశగా దూసుకుపోతోంది.. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో సందడి చేస్తూ.. ప్రేక్షకులను విశేషముగా ఆకట్టుకుంటోంది…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here