పట్టాలపై చిన్నారి.. వేగంగా వస్తున్న రైలు.. రైలుకి ఎదురెళ్ళినా రైల్వే ఉద్యోగి చివరికి?

0
76

ప్రమాదం ఎప్పుడు ఎటువైపు నుంచి ముంచుకు వస్తుందో ఎవరికీ తెలియదు. ఇటువంటి సమయంలోనే ఎంతోమంది ఎన్నో ప్రమాదాల బారిన పడుతుంటారు. తాజాగా ఒక రైల్వే ప్లాట్ ఫామ్ పై ఓ వ్యక్తితో కలిసి చిన్నారి నడుచుకుంటూ వెళుతోంది. అకస్మాత్తుగా కాలుజారి రైల్వే పట్టాలపై పడింది. అదే సమయంలో అటుగా రైలు ఎంతో వేగంతో దూసుకొస్తోంది.

ఒక్కసారిగా చిన్నారి రైల్వే పట్టాలపై పడడంతో తనకు తోడుగా వచ్చిన వ్యక్తి గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టాడు. ఇది గమనించిన రైల్వే ఉద్యోగి మయూర్ షెల్కే రైలుకు ఎదురెళ్లి పాప ప్రాణాలను రక్షించేందుకు సాహసం చేశాడు. రైల్వే పట్టాలపై పరుగులు పెడుతూ చిన్నారిని ఫ్లాట్ ఫామ్ మీదకు సురక్షితంగా ఎక్కించి సెకండ్ల వ్యవధిలోనే తను కూడా సురక్షితంగా బయటపడ్డాడు.

మయూర్ షెల్కే మహారాష్ట్రలోని థానే జిల్లా వంగణీ రైల్వే స్టేషన్‌లో పాయింట్స్ మెన్‌గా పనిచేస్తున్నాడు. అయితే శనివారం చిన్నారి ప్లాట్ ఫామ్ పై పడటంతో చిన్నారిని కాపాడేందుకు తన ప్రాణాలను సైతం లెక్క చేయలేదు. ఈ భయంకరమైన దృశ్యం సీసీ కెమెరాలో రికార్డు కావడంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు ఇతని ధైర్యసాహసాలు పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఆయన ధైర్యానికి సెంట్రల్ రైల్వేస్ ముంబై డివిజన్ డీఆర్‌ఎం సహా సిబ్బంది లేచి నిల్చుని చప్పట్లు కొడుతూ అభినందించారు. అదేవిధంగా ఈ వీడియో పై భారత రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పందించి మయూర్ షెల్కే కి అభినందనలను తెలియజేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here