Categories: FeaturedMovie News

విజయ్ సేతుపతిని తంతే రివార్డు..అని ప్రకటించిన వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు?

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎన్నో తమిళ చిత్రాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఉప్పెన సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైనా విజయ్ సేతుపతి పై బెంగళూరు ఎయిర్ పోర్టులో ఒక వ్యక్తి దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇది చాలా చిన్న గొడవ అని విజయ్ సేతుపతి వెల్లడించారు.

విజయ్ సేతుపతిని ఎవరైతే తంతారో వారికి 1001 అవార్డును ఇస్తున్నట్లు హిందూ మక్కల్‌ కట్చి నాయకుడు అర్జున్‌ సంపత్‌ కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. ఈ క్రమంలో ఇతని పై పోలీసులు కేసు నమోదు చేసి అతనిని అరెస్టు చేశారు.ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లోని సెక్షన్‌ 504, సెక్షన్‌ 506(1) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

అయితే అతను అవార్డును ప్రకటించడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే..స్వాతంత్య సమరయోధుడైన ముత్తు రామలింగం తేవర్‌’ను విజయ్‌ సేతుపతి అవమానించడంతో అతనిపై దాడి చేసిన వారికి నగదు బహుమానంగా ప్రకటిస్తానని అర్జున్ వెల్లడించారు. ఎయిర్ పోర్ట్ లో సెక్యూరిటీ ఉన్నప్పటికీ విజయ్ సేతుపతి పై దాడి జరగడం చాలా చిన్న విషయమని ఈ ఘటనపై విజయ్ సేతుపతి స్పందించారు.

ఒక స్టార్ హీరో పై విధమైనటువంటి దాడి జరగడం పట్ల విజయ్ సేతుపతి అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే పోలీసులు అతనిని అదుపులోకి తీసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇక విజయ్ సేతుపతి మాదిరిగానే తమిళ హీరో సూర్య పై దాడి చేసిన వారికి లక్ష రూపాయల బహుమానాన్ని ప్రకటిస్తానని పీఎంకే పార్టీ నేత వెల్లడించిన విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏది ఏమైనా తమిళ్ హీరోలకు ఇలాంటి అనుభవం ఎదురవడంతో ఎంతో మంది నెటిజన్లు సినీ ప్రముఖులు వీరికి మద్దతు తెలుపుతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago