Pooja Hedge: దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు తమిళ భాషలలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మెప్పించిన పూజా హెగ్డే ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్ సరసన నటించిన తాజా చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.
సల్మాన్ ఖాన్ హీరోగా ఈమె నటించిన కిసి కా భాయ్ కిసి కి జాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ఈనెల 21వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా పూజా హెగ్డే తన గురించి వస్తున్నటువంటి రూమర్లపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.
ఇదివరకే ఈమె సల్మాన్ ఖాన్ తో డేటింగ్ లో ఉన్నారు అనే విషయం గురించి మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు. తాను ప్రస్తుతం సింగిల్ గానే ఉన్నానని అయితే ఈ విషయాలన్నింటినీ కూర్చొని అందరికీ సమాధానం చెప్పే సమయం తనకు లేదు అంటూ కామెంట్స్ చేశారు. ఇక ఓ నిర్మాత పూజా హెగ్డే కు ఖరీదైన కారును గిఫ్ట్ గా ఇచ్చారని కూడా వార్తలు వచ్చాయి.
ఈ వార్తలపై కూడా పూజా హెగ్డే స్పందించారు.ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ నా గురించి వచ్చే వార్తలన్నింటినీ కూడా నేను చదువుతూ ఉంటాను అయితే నాకు ఓ నిర్మాత ఖరీదైన కారును గిఫ్ట్ గా ఇచ్చారని వార్తలు వస్తున్నాయి.ఒకవేళ నా గురించి చెడుగా ప్రచారం చేయాలి అనుకుంటే తనుకు కారును గిఫ్ట్ గా ఇచ్చి ప్రచారం చేయవచ్చు అంటూ పూజా హెగ్డే ఈ సందర్భంగా తప్పుడు వార్తలను ఖండించారు. ఈ క్రమంలోనే ఈమె చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…