Categories: FeaturedMovie News

Saidharam Tej: ప్రమాదం తర్వాత వారినే ముందుగా చూసాను… ప్రతి ఒక్కరూ క్షమించాలి: సాయి ధరమ్ తేజ్

Saidharam Tej: సుప్రీం హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈయన గత రెండు సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన విషయం మనకు తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి బయటపడిన సాయి ధరమ్ తేజ్ తిరిగి తన సినిమా పనులలో బిజీ అయ్యారు. ఈ క్రమంలోనే ఈయన హీరోగా నటించిన విరూపాక్ష సినిమా ఈనెల 21వ తేదీ విడుదల కానుంది.

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ప్రీరిలీజ్ వేడుకను ఏలూరులో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ తన ప్రమాదం గురించి పలు విషయాలను వెల్లడించారు.తాను ప్రమాదానికి గురై ప్రతి ఒక్కరిని టెన్షన్ పెట్టాను అందుకు నన్ను క్షమించాలని ఈయన క్షమాపణలు చెప్పారు..

ఇలా ప్రమాదం తర్వాత తాను స్పృహలోకి వచ్చినప్పుడు మొదటగా తన తల్లిని తన తమ్ముడిని చూసానని సాయి ధరమ్ తేజ్ వెల్లడించారు.అయితే ఆ సమయంలో వారికి సారీ చెప్పాలని చూసిన నాకు మాటలు రాలేదని ఒక బాధ ఒక మనిషిని ఎంతగా మారుస్తుందో అప్పుడే తనకు అర్థమైందని తెలిపారు. ఎలాగైనా తిరిగి మీ ముందుకు రావాలి మీ ప్రేమను పొందాలన్నా లక్ష్యంతో తాను మీ ముందుకు వచ్చానని తెలిపారు.

Saidharam Tej: హెల్మెట్ తప్పనిసరి….

లక్ష్యం సాధించడం కోసం మన జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఎవరు వెనక్కి తగ్గకూడదని మన లక్ష్యాన్ని చేదించి తల్లిదండ్రులు గురువులు గర్వపడేలా చేయాలని ఈయన తెలిపారు.అలాగే ప్రతి ఒక్కరూ ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని ఈయన అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఇలా ఈ కార్యక్రమంలో భాగంగా సాయిధరమ్ తేజ్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago