Pooja Hegde: పూజా హెగ్డే టాలీవుడ్ ఇండస్ట్రీలో బుట్ట బొమ్మగా పేరు సంపాదించుకున్న పూజా హెగ్డే ఇండస్ట్రీలో వరుస హిట్ సినిమాలలో నటించి క్రేజీ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్నారు.ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస హిట్ సినిమాలలో నటించిన పూజ హెగ్డేకు ఇండస్ట్రీలో భారీ డిమాండ్ పెరిగిపోయింది. అయితే ఈమెకు వరుస అవకాశాలు రావడంతో ఈమె నటించిన వరుస మూడు భారీ బడ్జెట్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.
సాధారణంగా మూడు వరుస ఫ్లాప్స్ అయితే ఆ హీరోయిన్ కి అవకాశాలు రావడం చాలా వరకు తగ్గిపోతాయి. కానీ మన బుట్ట బొమ్మకు మాత్రం అవకాశాలు ఏ మాత్రం తగ్గలేదని చెప్పాలి. వరుస ఫ్లాప్స్ ఎదుర్కొన్నప్పటికీ వరుస సినిమా అవకాశాలను అందుకొని దూసుకుపోతున్నారు. ఇదిలా ఉండగా 2021 సంవత్సరానికి గాను సైమా అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో భాగంగా పూజా హెగ్డే ఉత్తమ నటిగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రానికి అవార్డు అందుకున్నారు.
ఈ విధంగా ఉత్తమ నటిగా ఈమె అవార్డు అందుకోవడంతో ఎంతోమంది నేటిజన్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో పూజా హెగ్డే పాత్ర పెద్దగా చెప్పుకోదగిన పాత్ర కాదు.ఇందులో ఈమె సాధారణ హీరోయిన్ పాత్రలో నటించారు. అయినా ఈమెకు ఉత్తమ నటిగా అవార్డు రావడం ఏంటి అని కొందరు కామెంట్లు చేయడం మరికొందరు మాత్రం డబ్బులు ఇచ్చి ఈ అవార్డును కొనుక్కున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు.
నిజానికి సైమా అవార్డులలో ఉత్తమ నటి నామినేషన్ లో భాగంగా లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ సినిమాలకు గాను సాయి పల్లవి నామినేషన్స్ లోకి వచ్చారు. శ్యామ్ సింగరాయ్ సినిమాలో సాయి పల్లవి పాత్ర అద్భుతం అని చెప్పాలి. ఇలా ఈమెను కాకుండా ఉత్తమ నటి అవార్డు పూజ హెగ్డే ను వరించడంతో నేటిజన్స్ ఈ అవార్డుపై దారుణమైన కామెంట్లు చేస్తున్నారు.యావరేజ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమాకు ఉత్తమ నటి అవార్డు రావడం ఏంటి అంటూ పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…