Amala Paul: అమలాపాల్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఈమె కోలీవుడ్ నటి అయినప్పటికీ తెలుగులో కూడా పలువురు స్టార్ హీరోల సరసన నటించి తెలుగు ప్రేక్షకులను సందడి చేశారు. ఇలా ఈమె తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన నాయక్, అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో సినిమాలలో నటించి సందడి చేశారు.
ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అగ్ర హీరోల సరసన నటించిన మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.ఇక ఈమె తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ హీరోల సరసన అయితే నటించారో ఆ హీరోల కుటుంబాలని టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ టాలీవుడ్ చిత్ర పరిశ్రమను కేవలం నాలుగు కుటుంబాలు మాత్రమే ఏలుతున్నాయి అంటూ మాట్లాడారు.
ఇక ఆ కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు మాత్రమే ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగడమే కాకుండా మరి ఆ హీరోలకు ఇద్దరు హీరోయిన్లు కావాల్సి ఉంటుందంటూ ఈమె కామెంట్స్ చేశారు. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో గ్లామర్ రోల్స్, పాటలకు మినహా హీరోయిన్ కి ఎలాంటి ప్రాధాన్యత ఉండదంటూ ఈమె వెల్లడించారు.అయితే తమిళ ఇండస్ట్రీలో ఇలా కాదని హీరోయిన్ పాత్రకు కూడా ప్రాధాన్యత ఉంటుందంటూ ఈమె భేదాలు తెలియజేశారు..
ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి షాకింగ్ కామెంట్స్ చేస్తూ కోలీవుడ్ పై ప్రశంసలు కురిపించిన ఈమె తాను కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఉన్నందుకు చాలా అదృష్టవంతురాలిని అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక ఈమె చేసిన ఈ కామెంట్స్ వైరల్ కావడంతో పలువురు టాలీవుడ్ ప్రేక్షకులు తమదైన శైలిలో ఈ వ్యాఖ్యలను తిప్పుకొడుతూ కామెంట్లు చేస్తున్నారు.తెలుగు సినిమాలలో నటిస్తూ తెలుగు చిత్ర పరిశ్రమపై ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలుగు ప్రేక్షకులు మండిపడుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…