ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పలు పాన్ ఇండియా సినిమాలలో దూసుకుపోతున్న బ్యూటీ హీరోయిన్ పూజా హెగ్డే సౌత్ ఇండియా సినీ ఇండస్ట్రీలో అగ్ర కథానాయిక కొనసాగుతూనే బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న
భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ”రాధేశ్యామ్” మూవీలోను,అలాగే “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్”, “ఆచార్య”వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది.
బ్యూటీ క్వీన్ పూజా హెగ్డే తమిళ స్టార్ హీరో విజయ్ సరసన” బీస్ట్ ” అనే సినిమాలో నటిస్తోంది.అలాగే బాలీవుడ్లో రెండు సినిమాలు చేస్తోంది. పూజ సినిమాలతో పాటు సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ ఎప్పటికప్పడు తన వ్యక్తిగత విషయాలతో పాటు తన కెరీర్ కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది.తాజాగా పూజా హెగ్డే తన వంతు సమాజ సేవ చేయడానికి” ఆల్ ఎబౌట్ లవ్ ” అనే ఫౌండేషన్‌ను ప్రారంభించి చేతనైనంత సాయం చేసేందుకు ముందుకొచ్చి తన ఉదార స్వభావాన్ని చాటుకుంది.
ఈ సందర్భంగా పూజా హెగ్డే మాట్లాడుతూ తాను ఏర్పాటుచేసిన “ఆల్ ఎబౌట్ లవ్” అనే
స్వచ్ఛంద సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి వైద్య సాయం కోసం ఎదురుచూస్తున్న నిరుపేద ప్రజలకు ఎల్లవేళల అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసింది.ప్రేమ అనేది ఒక శక్తిమంతమైన భావోద్వేగం అని తాను ఎప్పటికీ నమ్ముతానని అందుకే మంచి మనసుతో చేసే సేవ ప్రపంచ మార్పుకు కారణం అవుతుందని తెలియజేసింది. అలాగే నన్ను ఆదరించి ఈ స్థాయిలో నిలబెట్టిన ప్రతి ఒక్క అభిమానానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…