ఈ ప్రపంచంలో ప్రేమను మించిన శక్తి మరొకటి లేదు.. అందుకే ఈ నిర్ణయం: పూజా హెగ్డే

0
72

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పలు పాన్ ఇండియా సినిమాలలో దూసుకుపోతున్న బ్యూటీ హీరోయిన్ పూజా హెగ్డే సౌత్ ఇండియా సినీ ఇండస్ట్రీలో అగ్ర కథానాయిక కొనసాగుతూనే బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న
భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ”రాధేశ్యామ్” మూవీలోను,అలాగే “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్”, “ఆచార్య”వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది.

బ్యూటీ క్వీన్ పూజా హెగ్డే తమిళ స్టార్ హీరో విజయ్ సరసన” బీస్ట్ ” అనే సినిమాలో నటిస్తోంది.అలాగే బాలీవుడ్లో రెండు సినిమాలు చేస్తోంది. పూజ సినిమాలతో పాటు సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ ఎప్పటికప్పడు తన వ్యక్తిగత విషయాలతో పాటు తన కెరీర్ కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది.తాజాగా పూజా హెగ్డే తన వంతు సమాజ సేవ చేయడానికి” ఆల్‌ ఎబౌట్‌ లవ్‌ ” అనే ఫౌండేషన్‌ను ప్రారంభించి చేతనైనంత సాయం చేసేందుకు ముందుకొచ్చి తన ఉదార స్వభావాన్ని చాటుకుంది.

ఈ సందర్భంగా పూజా హెగ్డే మాట్లాడుతూ తాను ఏర్పాటుచేసిన “ఆల్‌ ఎబౌట్‌ లవ్‌” అనే
స్వచ్ఛంద సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి వైద్య సాయం కోసం ఎదురుచూస్తున్న నిరుపేద ప్రజలకు ఎల్లవేళల అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసింది.ప్రేమ అనేది ఒక శక్తిమంతమైన భావోద్వేగం అని తాను ఎప్పటికీ నమ్ముతానని అందుకే మంచి మనసుతో చేసే సేవ ప్రపంచ మార్పుకు కారణం అవుతుందని తెలియజేసింది. అలాగే నన్ను ఆదరించి ఈ స్థాయిలో నిలబెట్టిన ప్రతి ఒక్క అభిమానానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here