Poonam Kaur: ఆ డైరెక్టర్లు మహిళలను ఆయుధాలుగా వాడుకుంటున్నారు… పూనమ్ ట్వీట్ వైరల్!
Poonam Kaur: పూనమ్ కౌర్ పరిచయం అవసరం లేని పేరు.ఈమె సినిమాలలో చాలా తక్కువగా నటించినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం వివాదాస్పదమైన పోస్టులు చేస్తూ పెద్ద ఎత్తున పాపులర్ అయ్యారు. ఇలా ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా తరచూ సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తూ ఎంతో గుర్తింపు పొందారు.
ఇకపోతే ఈమె సినిమాల విషయం గురించి మాత్రమే కాకుండా రాజకీయాల గురించి కూడా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పెద్ద ఎత్తున వివాదాలకు కారణం అవుతుంటారు. ఇకపోతే సోషల్ మీడియా వేదికగా ఈమె పరోక్షంగా పోస్టులు చేస్తూ అందరిని కన్ఫ్యూషన్ కి గురి చేస్తూ ఉంటారు.మొత్తానికి సినిమాలకన్నా వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలిచిన పూనమ్ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక షాకింగ్ విషయం వెల్లడించారు.
గత కొద్దిరోజులుగా కొందరు నటీమణులు అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే సమంత మయోసైటిసిస్ వ్యాధితో బాధపడుతుండగా తాజాగా పూనమ్ సైతం వింత వ్యాధితో బాధపడుతున్నానని తెలిపారు. ఈమె గత రెండు సంవత్సరాల నుంచి ఫైబ్రో మయాల్జియా అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపారు.
ఈ వ్యాధి కారణంగా తాను ఎక్కువసేపు నిలబడలేకపోవడం, తొందరగా నీరసించి అలసిపోవడం, మానసిక స్థితి సరిగా లేకపోవడం అలాగే జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోవడం వంటి లక్షణాలతో బాధపడుతున్నానని ఈమె తెలిపారు.ఇకపోతే ప్రస్తుతం తాను ఈ వ్యాధికి కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నట్టు ఈమె సోషల్ మీడియా వేదికగా తెలియజేయడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతూ ఈ వ్యాధి నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…