Movie News

TV Actor Eknadh: బుల్లితెర నటుడు ఏక్ నాథ్ హోమ్ టూర్ చూశారా.. పెంకుటిల్లు ఎంత ముచ్చటగా ఉందో!

TV Actor Eknadh: బుల్లితెర నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఏకనాథ్ గురించి పరిచయం అవసరం లేదు బుల్లితెర సీరియల్స్ చూసేవారికి ఈయన ఎంతో సుపరిచితం ప్రస్తుతం కేరాఫ్ అనసూయ సీరియల్ లో రాయుడు పాత్రలో నటించి సందడి చేస్తున్నారు. ఈయన మరొక సీరియల్ నటిని వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే.ఇక ఈ మధ్యకాలంలో టీవీ సెలబ్రెటీలు అందరూ ఒక వైపు సీరియల్స్ లో నటిస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఏకనాథ్ దంపతులు సైతం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే తాజాగా ఏక్ నాథ్ తన సొంత గ్రామంలో తాను పుట్టి పెరిగినటువంటి హోమ్ టూర్ ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు.తాను చిన్నప్పుడు పుట్టి పెరిగిన పెంకుటిల్లు చూడటానికి ఎంతో ముచ్చటగా అనిపిస్తుంది.

ఈయన స్వగ్రామం చిట్టూర్పులోని తన ఇంటిని చూపించాడు. అయితే ఇది పెంకుటిల్లు కావడంతో ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంటుంది. ముందుగా ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వగానే ఇంటి ఆవరణ మొత్తం పచ్చని మొక్కలతో చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంది.ఇకపోతే లోపలికి వెళ్ళగా తన మామయ్య గారు అప్పట్లో వారి జ్ఞాపకాలు అన్నిటిని గుర్తు చేయడమే కాకుండా కిచెన్ బెడ్ రూమ్ హాల్ వంటి అన్ని గదులను చూపించారు.

TV Actor Eknadh: ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం…

ఇక అప్పట్లో వంట చేసుకోవడానికి ప్రత్యేకంగా ఒక పాక వేసుకోవడం అలాగే మిక్సీలు గ్రైండర్లు లేని సమయంలో రోటిలో రుబ్బుకునేవారు అంటూ అన్ని విషయాలను వీడియో ద్వారా ప్రేక్షకులకు చూపించారు.ఇక ఇంటి ఆవరణంలో ఉన్నటువంటి ఉసిరి, సపోటా, మామిడి అరటి చెట్లను కూడా ఈ వీడియో ద్వారా అభిమానులతో పంచుకోవడంతో ఎంతోమంది వీడియో చూసి మాకు మా బాల్యం గుర్తుకు వస్తుందంటూ కామెంట్లు చేయగా ఇలాంటి వాతావరణం కేవలం పల్లెటూర్లలో మాత్రమే దొరుకుతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

24 hours ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

1 day ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

1 day ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

1 day ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

1 day ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

1 day ago