TV Actor Eknadh: బుల్లితెర నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఏకనాథ్ గురించి పరిచయం అవసరం లేదు బుల్లితెర సీరియల్స్ చూసేవారికి ఈయన ఎంతో సుపరిచితం ప్రస్తుతం కేరాఫ్ అనసూయ సీరియల్ లో రాయుడు పాత్రలో నటించి సందడి చేస్తున్నారు. ఈయన మరొక సీరియల్ నటిని వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే.ఇక ఈ మధ్యకాలంలో టీవీ సెలబ్రెటీలు అందరూ ఒక వైపు సీరియల్స్ లో నటిస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఏకనాథ్ దంపతులు సైతం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే తాజాగా ఏక్ నాథ్ తన సొంత గ్రామంలో తాను పుట్టి పెరిగినటువంటి హోమ్ టూర్ ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు.తాను చిన్నప్పుడు పుట్టి పెరిగిన పెంకుటిల్లు చూడటానికి ఎంతో ముచ్చటగా అనిపిస్తుంది.
ఈయన స్వగ్రామం చిట్టూర్పులోని తన ఇంటిని చూపించాడు. అయితే ఇది పెంకుటిల్లు కావడంతో ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంటుంది. ముందుగా ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వగానే ఇంటి ఆవరణ మొత్తం పచ్చని మొక్కలతో చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంది.ఇకపోతే లోపలికి వెళ్ళగా తన మామయ్య గారు అప్పట్లో వారి జ్ఞాపకాలు అన్నిటిని గుర్తు చేయడమే కాకుండా కిచెన్ బెడ్ రూమ్ హాల్ వంటి అన్ని గదులను చూపించారు.

TV Actor Eknadh: ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం…
ఇక అప్పట్లో వంట చేసుకోవడానికి ప్రత్యేకంగా ఒక పాక వేసుకోవడం అలాగే మిక్సీలు గ్రైండర్లు లేని సమయంలో రోటిలో రుబ్బుకునేవారు అంటూ అన్ని విషయాలను వీడియో ద్వారా ప్రేక్షకులకు చూపించారు.ఇక ఇంటి ఆవరణంలో ఉన్నటువంటి ఉసిరి, సపోటా, మామిడి అరటి చెట్లను కూడా ఈ వీడియో ద్వారా అభిమానులతో పంచుకోవడంతో ఎంతోమంది వీడియో చూసి మాకు మా బాల్యం గుర్తుకు వస్తుందంటూ కామెంట్లు చేయగా ఇలాంటి వాతావరణం కేవలం పల్లెటూర్లలో మాత్రమే దొరుకుతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
































