Posani Krishna Murali : తెలుగులో రైటర్ గా పరుచూరి బ్రదర్స్ దగ్గర అసిస్టెంట్ గా మొదలయి, అటు నటుడుగా ఇటు రైటర్ గా కొనసాగుతూ రెండింటిలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి పోసాని కృష్ణ మురళి నిజానికి తెలుగు ప్రేక్షకులకు మెంటల్ కృష్ణ అని చెబితే బాగా గుర్తొస్తారు. పోసాని విభిన్నంగా విలనిజం చూపిస్తాడు అలాగే విభిన్నంగా కామెడీ పండించగలడు. పరుచూరి బ్రదర్స్ తో పనిచేసిన పోసాని గాయం, రక్షణ వంటి సినిమాలతో రైటర్ గా మంచి గుర్తింపు వచ్చింది. ఇక వెంకటేష్ పెళ్లిచేసుకుందాం, ప్రేమించుకుందాం రా వంటి సినిమాలకు పనిచేసారు. రాజకీయాల్లో యాక్టీవ్ గా ఉండే పోసాని గారు ప్రస్తుతం వైసీపీ కోసం పనిచేస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో ఫిల్మ్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేస్తున్న ఆయన ప్రస్తుత రాజకీయాల గురించి మాట్లాడారు.
పవన్ కుల రాజకీయాలు చేస్తున్నాడు…
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గురించి అందులో నచ్చే ఇద్దరు నాయకుల గురించి పోసాని గారిని అడిగితే పవన్ మీద ఫైర్ అయ్యాడు. ఒకప్పుడు ప్రజారాజ్యంకి దగ్గర ఉండి చిరంజీవి అంటే గౌరవంగా ఉండే పోసాని ప్రస్తుతం మారిన పరిస్థితుల నేపథ్యంలో వైసీపీలో ఉన్నారు. వైసీపీ నుండి జనసేన మీద తీవ్రంగా విరుచుకుపడే పోసాని పవన్ కుల రాజకీయాలు చేస్తాడు అంటూ తెలిపారు. జనసేన కు ఒక విధానము అంటూ లేదని, అజెండా ప్రకటిస్తే ఏదైనా మాట్లాడొచ్చు, తన పార్టీ ఎందుకు ఉందో ఇంతవరకూ క్లారిటిగా చెప్పలేదని చెప్పారు.
ఇక పవన్ కుల ప్రస్తావన లేకుండా రాజకీయం చేస్తానని చెబుతూనే కాపు కులాన్నీ నేనే ఉద్దరిస్తాను అని మాట్లాడుతున్నాడు. అది తప్పు. ఒకవేళ కాపు కులం కోసం నేను పార్టీ పెట్టాను అనుంటే అది వేరే విషయం కానీ కులప్రస్తావన లేని రాజకీయం అని చెప్పి మళ్ళీ కాపు కులాలానికి నేనే దిక్కు అన్నట్లు మాట్లాడటం బాగోలేదు అంటూ ఫైర్ అయ్యాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…