Analyst Damu Balaji : మెగా ఫ్యామిలీలో ఏ చిన్న విషయం అయినా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక మెగా కుటుంబం మొత్తం చిన్న ఫంక్షన్స్ అయినా అందరూ కలిసి సందడి చేస్తారు. అలాంటిది మెగా ఇంటికి వారసుడు రాబోతున్నపుడు ఆ ఈవెంట్ ఇంకెంత గ్రాండ్ గా చేయాలి మెగా కుటుంబం. అలాగే సినిమా ప్రముఖులు ఇలా అందరినీ పిలిచి గ్రాండ్ గా ఉపాసన సీమంతం చేస్తారని అందరూ భావించారు కానీ అసలు ఏ మాత్రం తెలియకుండా అసలు మెగా ఫ్యామిలీనే లేకుండా ఉపాసన సీమంతం కేవలం ఆమె కుటుంబ సభ్యుల మధ్య అది కూడా దుబాయ్ లో జరిగింది. ఈ సీమంతంకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ విషయం గురించి అనలిస్ట్ దాము బాలాజీ వివరించారు.
ఆ కారణాలతోనే దుబాయ్ లో సీమంతం…
ఉపాసన, రామ్ చరణ్ లకు పెళ్లి జరిగి దాదాపు 10 ఏళ్ళు దాటిపోయింది. వాళ్లకు ఇప్పటి వరకూ పిల్లలు లేరు. ఇప్పటివరకు ఈ లోటు మెగా ఫ్యామిలీ లోనూ అలాగే మెగా అభిమానులకు ఉండేది. అయితే అందరికీ శుభవార్త చెబుతూ ఈ ఏడాది మెగా బుల్లి మెంబెర్ రాబోతున్నట్లు ప్రకటించారు. ఇక ఇదంతా బాగానే ఉన్నా తాజాగా ఉపాసన సీమంతం దుబాయ్ లో అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది. కేవలం రామ్ చరణ్ అలాగే తన నాన్నమ్మ తప్ప ఇంకెవరూ ఆ వేడుకలో కనిపించకపోవడంతో అందరికీ అనుమానాలు మొదలయ్యాయని అనలిస్ట్ దాముబాలాజీ అభిప్రాయాపడ్డారు.
మెగా ఫ్యామిలీకి ఉపాసన ఫ్యామిలీకి మధ్య ఎలాంటి బేధభిప్రాయాలూ లేవని ఆయన తెలిపారు. చాలా మంది చిన్న చిన్న సెలబ్రిటీలు ఇలాంటి ఫంక్షన్స్ గ్రాండ్ గా చేసుకోడానికి ఇష్టపడుతారు కానీ మెగా ఫ్యామిలీ లాంటి వాళ్ళు బయటికి షో చేయాలని అనుకోరు. అందులోనూ లేట్ వయసులో ఉపాసన తల్లి కాబోతుండటం వల్ల తన జాగ్రత్తలు తనకు ఉంటాయి అందువల్లే ఫంక్షన్ సింపుల్ గా చేశారేమో అంటూ తెలిపారు. ఇక మెగా కుటుంబానికి రామ్ చరణ్ కి పిల్లలు పుట్టడం అనేది సంతోషకరమైన విషయం అలాంటిది వాళ్లెందుకు ఫంక్షన్ కి దూరం అవ్వాలని అనుకుంటారు అంటూ బాలాజీ తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…