Featured

Posani Krishna Murali : పోసాని భార్య గురించి… పిల్లలు ఏం చేస్తున్నారంటే…: పోసాని కృష్ణ మురళి

Posani Krishna Murali : తెలుగులో రైటర్ గా పరుచూరి బ్రదర్స్ దగ్గర అసిస్టెంట్ గా మొదలయి, అటు నటుడుగా ఇటు రైటర్ గా కొనసాగుతూ రెండింటిలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి పోసాని కృష్ణ మురళి నిజానికి తెలుగు ప్రేక్షకులకు మెంటల్ కృష్ణ అని చెబితే బాగా గుర్తొస్తారు. పోసాని విభిన్నంగా విలనిజం చూపిస్తాడు అలాగే విభిన్నంగా కామెడీ పండించగలడు. పరుచూరి బ్రదర్స్ తో పనిచేసిన పోసాని గాయం, నాగార్జున రక్షణ వంటి సినిమాలతో రైటర్ గా మంచి గుర్తింపు వచ్చింది. ఇక వెంకటేష్ పెళ్లిచేసుకుందాం, ప్రేమించుకుందాం రా వంటి సినిమాలకు పనిచేసారు. రాజకీయాల్లోనూ యాక్టీవ్ గా ఉన్న పోసాని గారు ప్రస్తుతం వైసీపీ కోసం పనిచేస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో ఫిల్మ్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేస్తున్న ఆయన తన వ్యక్తిగత విషయాలను ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

కొడుకులిద్దరూ డైరెక్టర్స్ గా…

పోసాని గారు కాలేజి రోజుల్లోనే రాజకీయాల్లో ఉంటూ న్యూట్రల్గా ఉండి స్టూడెంట్స్ యూనియన్ కి జనరల్ సెక్రెటరీ గా పనిచేశారట. వంగవీటి రంగాతో మంచి అనుబంధం ఉన్న ఆయన పిహెచ్డి చేస్తున్న సమయంలో బిఏ.బిఎల్ చేసిన తన భార్య కుసుమ లతతో పెద్దలు వివాహం కుదుర్చారట. మొదటి నుండి తన భార్య తాను స్నేహాతులుగానే ఉంటామని, ఏ విషయంలో అయినా ఇద్దరం చర్చించుకుని నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇక పోసాని గారికి ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు ఉజ్వల్ హాంకాంగ్ లో ఫిల్మ్ కోర్స్ చేసి మళ్ళీ హంగేరికి వెళ్లి అక్కడ ఏదో కోర్సులు చేసాడు. హాలీవుడ్ లో పనిచేయాలని వాడి కోరిక, ఒక ఇంగ్లీష్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేసినా అమెరికాలో వాతావరణం పడక మళ్ళీ హైదరాబాద్ వచ్చేసాడు అంటూ తెలిపారు.

ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు అన్నీ చూసుకుంటూ తానే సొంతంగా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. ఇక చిన్నకొడుకు ప్రజ్వల్ కి కూడా సినిమాలంటే ఇష్టం అందుకే ఇంటర్మీడియట్ అయిపోగానే లాస్ ఏంజెల్స్ లో డైరెక్షన్ కోర్స్ లో చేరి నేర్చుకున్నాడు. త్వరలో డైరెక్టర్ అవుతానని అంటున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేస్తున్నాడు అంటూ తెలిపారు. కొరటాల శివ దగ్గర అసిస్టెంట్ గా ‘భరత్ అనే నేను’ సినిమాకు పనిచేసాడు ప్రజ్వల్.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago