Anchor Lasya: బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యాంకర్ లాస్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కెరియర్ మొదట మ్యూజిక్ ఛానల్ కు యాంకర్ గా వ్యవహరిస్తూ ఏనుగు చీమ జోక్స్ ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి లాస్య ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు దూరమయ్యారు.
యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనంతరం మంజునాథ్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని వైవాహిక జీవితంలో స్థిరపడిన లాస్య ఇద్దరు మగ పిల్లలకు జన్మనిచ్చారు.మొదట అబ్బాయికి మూడు సంవత్సరాలు కాగా గత కొద్ది రోజుల క్రితం రెండవ అబ్బాయికి కూడా ఈమె జన్మనిచ్చారు. అయితే తాజాగా తన చిన్న కుమారుడికి నామకరణం చేసినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఈ నామకరణానికి సంబంధించినటువంటి ఓ చిన్న వీడియోని ఈమె ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఇందులో లాస్య దంపతులు పిల్లలు కలిసి ఒకే అవుట్ ఫిట్ లో కనిపిస్తూ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.చిన్న కుమారుడిని మంజునాథ్ ఎత్తుకోగా పెద్దబ్బాయిని లాస్య పట్టుకుని నడుస్తూ వెళ్తున్నారు. ఇక ఈ వీడియోని షేర్ చేస్తూ తన కొడుకు పేరును కూడా ఈమె రివిల్ చేశారు.
ఈ సందర్భంగా లాస్య తన చిన్న కుమారుడికి మోక్ష్ అధీరన్ అనే నామకరణం చేసినట్లు తెలుస్తోంది. ఇలా ఈ వీడియో వైరల్ గా మారడంతో పలువురు అభిమానులు పేరు చాలా సూపర్ గా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం లాస్య షేర్ చేసిన ఈ వీడియో వైరల్ గా మారింది.ఈమె ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు దూరమైన సొంతంగా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…