Posani Krishna Murali : తెలుగులో రైటర్ గా పరుచూరి బ్రదర్స్ దగ్గర అసిస్టెంట్ గా మొదలయి, అటు నటుడుగా ఇటు రైటర్ గా కొనసాగుతూ రెండింటిలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి పోసాని కృష్ణ మురళీ. నిజానికి తెలుగు ప్రేక్షకులకు మెంటల్ కృష్ణ అని చెబితే బాగా గుర్తొచ్చే పోసాని విభిన్నంగా విలనిజం చూపిస్తాడు. అలాగే విభిన్నంగా కామెడీ పండించగలడు. పరుచూరి బ్రదర్స్ తో పనిచేసే సమయంలోనే వర్మ సినిమాలో అవకాశం వచ్చినా పని పూర్తిగా నేర్చుకున్నాకే చేస్తానని చెప్పి తిరస్కరించిన పోసాని ఆ తరువాత గాయం, నాగార్జున రక్షణ వంటి సినిమాలతో రైటర్ గా మంచి గుర్తింపు వచ్చింది. ఇక వెంకటేష్ పెళ్లిచేసుకుందాం, ప్రేమించుకుందాం రా వంటి సినిమాలకు పనిచేసారు. ఇక రాజకీయాల్లోనూ యాక్టీవ్ గా ఉన్న పోసాని గారు ప్రస్తుతం వైసీపీ కోసం పనిచేస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో ఫిల్మ్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేస్తున్న ఆయన తన వ్యక్తిగత విషయాలను ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
చనిపోతానని తెలిసిపోయింది…
పోసాని గారికి కొద్ది కాలానికి ముందు హెర్నియా సర్జరీ జరిగింది. ఆ సర్జరీ చాలా చిన్నది అలాగే ఎక్కువ మంది చేయించుకుంటున్నదే. అయితే ఆ సర్జరీ సమయంలో ఇన్ఫెక్షన్ సోకడం వల్ల పోసాని గారికి సీరియస్ అయింది. షుగర్ వ్యాధి అప్పటికే ఉండటం వల్ల ఇన్ఫెక్టన్ ఎక్కువగా సోకి ఆయన ప్రాణాపాయ స్టేజికి వెళ్లిపోయారట. ఆ సమయంలో 20 రోజుల్లో 7 కిలోల బరువు తగ్గిపోయి దాదాపు పీనుగులా అయిపోయాను అంటూ చెప్పారు పోసాని.
ఆయనకు డాక్టర్స్ హైడోస్ మందులు ఇస్తుంటే పోసాని గారు నేను చనిపోతానని నాకనిపిస్తుంది, నాకు ఈ మందులు అవి ఏం ఇవ్వకండి చాలా ఇబ్బంది పడుతున్నాను, నా వల్ల కాదు అని మెడిసిన్ మొత్తం ఆపేసారట డాక్టర్స్. అయితే ఆ సమయంలో పోసాని గారి భార్య తెలిసిన డాక్టర్స్ ప్రసాద్ గారికి కాల్ చేసి ఏడ్చి విషయం మొత్తం చెబితే ఆయన లండన్ లో ఉన్న పోసాని గారి కోసం హాస్పిటల్ కి నేరుగా వచ్చి ఆయనకు చిన్న పరీక్షలు చేస్తాం అని చెప్పి పెట్ టెస్టు చేయించి మరో సర్జరీ చేసి ఇన్ఫెక్షన్ ను తొలగించారట. అలా నెమ్మదిగా కోలుకున్నాను అంటూ పోసాని గారు తెలిపారు. ఆ సమయంలో జగన్ గారు సజ్జల గారిని మరి కొంతమందిని పంపి ఎలా ఉంది అని అన్ని విషయాలు వాకబు చేసేవారంటూ తెలిపారు పోసాని.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…