Featured

Lyricist Jonnavitthula : బ్రాహ్మణులు సోమరులు… కోమట్లు స్మగ్లర్లు అని రాసారు… బాహుబలి సినిమా నుండి తప్పుకోడానికి కారణం అదే…: జొన్నవిత్తుల

Lyricist Jonnavitthula : తెలుగు సినిమాకు సాహిత్యం అందిస్తూ గుర్తింపు తెచ్చుకున్న జొన్నవిత్తుల గారు ఎన్నో ప్యారడి పాటలను రాశారు. ఇక సినిమాల్లో పాటలు రాయడమే కాకుండా తెలుగు భాషకు సేవ చేస్తున్నారు, అలా పద్యాలు రాస్తుంటారు. వివాదరహితంగా తన పని తాను చూసుకునే జొన్నవిత్తుల గారు మంచు విష్ణు సినిమా ‘దేనికైనా రెడీ’ విషయంలో వివాదాస్పదం అయ్యారు. బ్రాహ్మణులను కించపరిచారంటూ టీవీ డిబేట్లలో పాల్గొని వాదించడంతో బాగా వైరల్ అయ్యారు. ఇక తెలంగాణ కవి ఐలయ్య గారు రాసిన పుస్తకంలో అగ్రకులాలను కించపరచడం గురించి కూడా ఆయన పోరాడారు.

బ్రాహ్మణులు, కోమట్లను అనడం నచ్చలేదు…

ఐలయ్య గారు అయన పుస్తకంలో బ్రాహ్మణులు సోమరులని, కోమట్లు స్మగ్లర్లు అంటూ రాసారు. అది అభ్యంతరకరం అని నేను చెప్పినందుకు వాదించారు కానీ చివరకు వెనక్కి తగ్గారు అంటూ తెలిపారు. కోమటి వారిని ముఖ్యంగా స్మగ్లర్లు అనడం నచ్చలేదు. వాళ్ళు ఇండియా ఆర్థిక మూలాలు పటిష్టం అవడానికి కారకులు. మొదటి నుండి అప్పు ఇచ్చి సరుకులు అమ్మారు. ఇక ఇప్పుడు బ్యాంకులు ఉన్నాయి కానీ పూర్వం అవి లేని సమయంలో వడ్డీ వ్యాపారం చేసి ఆర్థిక వ్యవస్థను నడిపారు. అలాంటి వాళ్ళను అలా స్మగ్లర్లు అనడం సమంజసం కాదు.

ఇక బ్రాహ్మణులు సోమరులైతే మరి గిడుగు రామ్మూర్తి పంతులు గారు, ప్రకాశం పంతులు గారు, పింగళి వెంకయ్య గారు, మంగల్ పాండే వీళ్లంతా ఎవరు ఏం చేయలేదా దేశానికి అంటూ అందుకే అభ్యంతరం చెప్పాను అంటూ తెలిపారు. ఇక బాహుబలి సినిమా సమయంలో మొదట రైటర్ గా నన్ను పెట్టుకున్నారు. విజయేంద్ర ప్రసాద్ గారు నన్ను పెట్టుకోమని సలహాలు ఇచ్చారట. ఒక మూడు నెలలు కథా చర్చలు అన్నీ సాగాయి కానీ ఆ తరువాత వాళ్ళు ఒక రెండు మూడేళ్లు మాతోనే ఉండాలి అని చెప్పేసరికి నా సభలకు మిగిలిన పనులకు ఇబ్బంది పడాల్సి వస్తుందని నేనే రానని చెప్పేసాను. ఆ మూడు నెలలు పనిచేసినందుకు నాకు మంచి రెమ్యూనరేషన్ ఇచ్చారు అంటూ తెలిపారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago