Posani: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో మంది వైకాపా కీలక నేతలు పార్టీకి రాజీనామా చేస్తూ ఇతర పార్టీలలోకి వెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక కొంతమంది మాత్రం శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నామని ప్రకటిస్తున్నారు. తాజాగా సినీ నటుడు రచయిత దర్శకుడు పోసాని కృష్ణమురళి సైతం రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసారు.
సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు తెలపడమే కాకుండా పార్టీ కార్యకలాపాలలో ఎంతో కీలకంగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఈయనకి తెలుగు ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్ గా బాధ్యతలను అప్పజెప్పారు. ఈ విధంగా ఈయన వైసీపీ పార్టీలో కొనసాగుతూ పవన్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పవన్ ఫాన్స్ ఏకంగా ఈయన ఇంటిపై కూడా దాడి చేశారు.
ఇక ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన వారి పై చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పోసానిపై కూడా కేసు నమోదు కావడంతో ఈయన స్పందించారు. తాను అనవసరంగా ఎవరిని తిట్టలేదు పవన్ కళ్యాణ్ అభిమానులు తన కుటుంబం పై దాడి చేయడంతోనే నేను కూడా విమర్శలు చేశాను అంటూ ఈయన చెప్పారు.
ఇక తాజాగా తాను ఈ రాజకీయాలలో కొనసాగలేనని అందుకే తాను ఏ పార్టీలకు మద్దతు తెలియజేయకుండా పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని వెల్లడించారు. ఇక తాను ఇండస్ట్రీలో నటుడిగా దర్శకుడిగా రచయితగా కూడా కొనసాగాను. ఇకపై సినిమాలలో అవకాశాలు వస్తే నటిస్తానని లేకపోతే నేనే సినిమాలు చేస్తాను అంటూ కూడా ఈ సందర్భంగా పోసాని జగన్మోహన్ రెడ్డికి క్షమాపణలు చెబుతూ ఈయన రాజకీయాల నుంచి తప్పుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…