Prabhakar Reddy : లెజెండరీ యాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారి ఇల్లు ఒక మ్యూజియం.. 1000 కోట్ల ఇంద్రభవనంలాంటి ఇల్లు చూస్తె మతిపోవాల్సిందే..!

Prabhakar Reddy : 1960 లో చివరికి మిగిలేది సినిమాతో సినిమా రంగప్రవేశం చేసిన ప్రభాకర్ రెడ్డి గారి జన్మ స్థలం ఇప్పటి సూర్యాపేట, తెలంగాణ రాష్ట్రం. ప్రభాకర్ రెడ్డి గారు చాలా సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించారు. తండ్రి, అన్న లాంటి సపోర్టింగ్ పాత్రలలో కూడా మెప్పించారు. ఆయన నటనకు నాలుగు నందులు కదిలి ఆయన ఇంటికి వచ్చాయి. ఇక ఎన్నో అవార్డులు, సన్మానాలు ఆయన సొంతం. ప్రభాకర్ రెడ్డి గారికి ముగ్గురు కూతుర్లు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టర్ అయ్యారు. డాక్టర్ అయ్యాక, యాక్టర్ అయిన ప్రభాకర్ గారు మంచి రచయిత కూడా. స్వతహాగా కొన్ని సినిమాలకు కథలు కూడా రాసారు.

ఇల్లు ఇంద్రభవనం…

ఇక హైదరాబాద్ లోని ప్రభాకర్ రెడ్డి గారికి కోట్లు విలువ చేసే ఇల్లు ఉంది. సాధారణంగా సెలబ్రిటీల ఇల్లు అనగానే లగ్జరీయస్ గా ఉంటాయి. అయితే ప్రభాకర్ రెడ్డి గారి ఇల్లు విలాసవంతంగా కంటే పాత తరం వస్తువులతో ఒక మ్యూజియం ను తలపిస్తుంది. అలనాటి వస్తువులతో ఖరీదైన యాంటిక్ శిల్పాలు, కళాఖండాలతో అద్భుతంగా ఉంది. ఆయన కూతుళ్ళకు ఖరీదైన ఇల్లులను కట్టించిన ప్రభాకర్ రెడ్డి గారు ఇంటిని తన సొంత ఆలోచనతో డిజైన్ చేసుకున్నారు. ఇక ఆయన భార్య హీరోయిన్లకు బట్టలను డిజైన్ చేసేవారట అయితే కేవలం ఆయన సినిమాల్లో మాత్రమే చేసేవారట.

ఇక ప్రభాకర్ రెడ్డి గారు పుస్తకాలు కూడా రాసారు. ఇక ఆయన తన ఆస్తిలో ఎంతో విలువ చేసే భూమిని కార్మికుల కోసం దానం చేసారు. ఇప్పుడు ఆ భూముల విలువ కొన్ని వేల కోట్లు. ప్రభుత్వం చిత్రపురి కాలనీ పేరుని ప్రభాకర్ రెడ్డి గారి పేరు ను ఆయన జ్ఞాపకార్థం పెట్టారు. ఇక ఆయన రాసిన కథలు కొన్ని హిట్ సినిమాలుగా కూడా ఉన్నాయి. పండంటి కాపురం, పచ్చని సంసారం, ధర్మాదత్త వంటి సినిమాలు మంచి సక్సెస్ ను చూసాయి. ప్రభాకర్ రెడ్డి గారు వాడిన బెంజ్ కారు, ఇంకా ఇతర వెహికల్స్ ను ఆయన వాడిన వస్తువులను, హ్యాట్ లను కూడా అలానే ఉంచారు. అరుదైన వస్తువుల కలెక్షన్ తో నిజంగా ఒక మ్యూజియం లాగానే ఉంది.