Featured

Prabhas : ఆది పురుష్ డైరెక్టర్ ను ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్న డార్లింగ్ అభిమానులు.. ఇంతకీ కారణం ఏంటంటే…!

Prabhas : ప్రభాస్ కేవలం టాలీవుడ్ హీరో కాదు ఇపుడు పాన్ ఇండియా సూపర్ స్టార్. బహుబలి తో ప్రభాస్ కి ఉన్న క్రేజ్ కి  ఫాలోయింగ్ కూడా అలానే పెరిగింది. ఇక ఆయన లేటెస్ట్ సినిమా అప్ డేట్స్ కోసం అభిమానులు పరితపిస్తున్నారు. అయితే ఒక్క సినిమా నుండి కూడా రవ్వంతైనా విషయం బయటికి రావడం లేదు. బాహుబలి తరువాత ప్రభాస్ నటించిన సాహో, రాధే శ్యామ్ రెండు సినిమాలు డిజాస్టర్ గా నిలవడంతో అసలే నిరాశలో ఉన్న అభిమానులకు ఒక అప్ డేట్ కూడా లేకపోవడం మరింత నిరాశను కలిగిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ మూడు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నాడు. ఆ మూడు సినిమాలు ఆది పురుష్, ప్రాజెక్ట్ కే, సలార్. ఇందులో సలార్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తుంటే ప్రాజెక్ట్ కే మహా నటి డైరెక్టర్ నాగ అశ్విన్ డైరెక్షన్ లో వస్తోంది. ఇక అది పురుష్ ఓం రౌత్ డైరెక్షన్ లో వస్తోంది.

అధిపురుష్ డైరెక్టర్ ను ట్రోల్ చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్….

ఇక ప్రభాస్ ఫ్యాన్స్ కి బాగా కోపం తెప్పిస్తున్న డైరెక్టర్ మాత్రం ఓం రౌత్ . ఎందుకంటే ఈ సినిమా మొదలు పెట్టి చాలా రోజులు అయిపోయింది. మొదట ఈ సినిమాను ఆగష్టు 11, 2022 లో విడుదల చేస్తామని డైరెక్టర్ డేట్ ప్రకటించాడు. ఇక మళ్ళీ కొంతకాలానికి జనవరి 2023 లో విడుదల చేస్తామని చెప్పాడు.  అయినా అభిమానులు ఓపిక పడుతున్న కనీసం ఒక ఫస్ట్ లుక్ కానీ పోస్టర్ కానీ ప్రభాస్ గెటప్ కి సంబందించి చిన్న టీజర్ కానీ ఏమాత్రం విడుదల చేయకపోవడంతో ఫ్యాన్స్ కి మండిపోతోంది.

మొదట ప్రకటించిన విడుదల తేదీ ఇవాళే కావడంతో ట్రోల్స్, మీమ్స్ తో డైరెక్టర్ ను ఆడేసుకుంటున్నారు. సినిమా టిక్కెట్లు దొరకడం కష్టంగా ఉందని కొందరు వెటకారంగా కామెంట్స్ చేస్తుంటే నాకు దొరికాయి అంటూ పిక్స్ పెట్టి మరీ ట్రోల్ చేస్తున్నారు. ఇక మరీ కొందరు ఆది పురుష్ సినిమా ఫస్ట్ రివ్యూ అంటూ ప్లస్ ఇవి మైనస్ ఇవి అంటూ పోస్ట్లు పెడుతున్నారు. ఆ మధ్య ఒకసారి ఫ్యాన్ మేడ్ పోస్టర్ ను ఓం రౌత్ పోస్ట్ చేసి అభిమానులకు కోపం తెప్పించాడు. ఇక ఇప్పుడైనా ఈ ట్రోల్ల్స్ చూసి కనీసం రాముడి గెటప్ లో ప్రభాస్ పోస్టర్ అయినా చూపిస్తాడో లేదో చూడాలి.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago