Prabhas : ప్రభాస్ కేవలం టాలీవుడ్ హీరో కాదు ఇపుడు పాన్ ఇండియా సూపర్ స్టార్. బహుబలి తో ప్రభాస్ కి ఉన్న క్రేజ్ కి ఫాలోయింగ్ కూడా అలానే పెరిగింది. ఇక ఆయన లేటెస్ట్ సినిమా అప్ డేట్స్ కోసం అభిమానులు పరితపిస్తున్నారు. అయితే ఒక్క సినిమా నుండి కూడా రవ్వంతైనా విషయం బయటికి రావడం లేదు. బాహుబలి తరువాత ప్రభాస్ నటించిన సాహో, రాధే శ్యామ్ రెండు సినిమాలు డిజాస్టర్ గా నిలవడంతో అసలే నిరాశలో ఉన్న అభిమానులకు ఒక అప్ డేట్ కూడా లేకపోవడం మరింత నిరాశను కలిగిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ మూడు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నాడు. ఆ మూడు సినిమాలు ఆది పురుష్, ప్రాజెక్ట్ కే, సలార్. ఇందులో సలార్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తుంటే ప్రాజెక్ట్ కే మహా నటి డైరెక్టర్ నాగ అశ్విన్ డైరెక్షన్ లో వస్తోంది. ఇక అది పురుష్ ఓం రౌత్ డైరెక్షన్ లో వస్తోంది.

అధిపురుష్ డైరెక్టర్ ను ట్రోల్ చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్….
ఇక ప్రభాస్ ఫ్యాన్స్ కి బాగా కోపం తెప్పిస్తున్న డైరెక్టర్ మాత్రం ఓం రౌత్ . ఎందుకంటే ఈ సినిమా మొదలు పెట్టి చాలా రోజులు అయిపోయింది. మొదట ఈ సినిమాను ఆగష్టు 11, 2022 లో విడుదల చేస్తామని డైరెక్టర్ డేట్ ప్రకటించాడు. ఇక మళ్ళీ కొంతకాలానికి జనవరి 2023 లో విడుదల చేస్తామని చెప్పాడు. అయినా అభిమానులు ఓపిక పడుతున్న కనీసం ఒక ఫస్ట్ లుక్ కానీ పోస్టర్ కానీ ప్రభాస్ గెటప్ కి సంబందించి చిన్న టీజర్ కానీ ఏమాత్రం విడుదల చేయకపోవడంతో ఫ్యాన్స్ కి మండిపోతోంది.
మొదట ప్రకటించిన విడుదల తేదీ ఇవాళే కావడంతో ట్రోల్స్, మీమ్స్ తో డైరెక్టర్ ను ఆడేసుకుంటున్నారు. సినిమా టిక్కెట్లు దొరకడం కష్టంగా ఉందని కొందరు వెటకారంగా కామెంట్స్ చేస్తుంటే నాకు దొరికాయి అంటూ పిక్స్ పెట్టి మరీ ట్రోల్ చేస్తున్నారు. ఇక మరీ కొందరు ఆది పురుష్ సినిమా ఫస్ట్ రివ్యూ అంటూ ప్లస్ ఇవి మైనస్ ఇవి అంటూ పోస్ట్లు పెడుతున్నారు. ఆ మధ్య ఒకసారి ఫ్యాన్ మేడ్ పోస్టర్ ను ఓం రౌత్ పోస్ట్ చేసి అభిమానులకు కోపం తెప్పించాడు. ఇక ఇప్పుడైనా ఈ ట్రోల్ల్స్ చూసి కనీసం రాముడి గెటప్ లో ప్రభాస్ పోస్టర్ అయినా చూపిస్తాడో లేదో చూడాలి.

































