Minister Nani: ఏపీ ప్రభుత్వానికి సినీ పరిశ్రమకు మధ్య గత కొన్ని రోజుల నుంచి టికెట్ల వ్యవహారం నడుస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ‘ది రిపబ్లిక్’ అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన మాటలు ఎంత పెద్ద దుమారం రేపాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడు రాజుకున్న వేడి.. ఇప్పటికీ మానలేదు.
మధ్య లో హీరో నాని కల్పించుకొని దానిపై ఎక్కువగా పోరాడినా ఫలితం లేకుండా పోయింది. తర్వాత వివాదాస్పద డైరెక్టర్ ఆర్జీవీ కూడా దీనిపై పోరాడాడు. మంత్రి పేర్ని నానిని టార్గెట్ చేస్తూ.. ట్విట్టర్ వేదికగా ట్వీట్ల వర్షం కురింపించాడు. దానికి కౌంటర్ గా మంత్రి కూడా ఘటుగానే స్పందిస్తూ.. రీ కౌంటర్లు వేశాడు. తర్వాత ఓ రోజు ఆర్జీవీతో భేటీ తర్వాత కాస్త ఆ వివాదం తగ్గినట్లు కనిపించింది.
ఇక తర్వాత సినిమా పరిశ్రమకు సంబంధించిన నటులు, పెద్దలు ఇటీవల సీఎం జగన్ తో భేటీ అయ్యి.. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులను సీఎం జగన్ ముందు ఉంచారు. తర్వాత చిరంజీవిపై ఆర్జీవీ ఫైర్ అయిన సంగతి కూడా తెలిసిందే. ప్రభుత్వం వద్ద అడుక్కోవడం కరెక్ట్ గా లేదు అంటూ ఆర్జీవీ మరో సారి ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డాడు.
తాజాగా పేర్ని నాని పవన్ కళ్యాన్ సినిమాకు వచ్చే వసూళ్లపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. పవన్ కళ్యాన్ కంటే ఎక్కువగా చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాలకు కలెక్లన్లు ఎక్కువగా వస్తున్నాయని.. అప్పుడెప్పుడో అత్తారింటికి దారేది సినిమాకు వచ్చిన కలెక్షన్లు ఇంత వరకు అతడికి రాలేదు అంటూ.. పేర్ని నాని మండిపడ్డాడు. పవన్ ను టార్గెట్ చేసి టికెట్ రేట్లను తగ్గించారా అని అడగ్గా.. ఇలా సమాధానం ఇచ్చాడు. పవన్ కళ్యాన్ టార్గెట్ ఏంటి.. పవన్ కళ్యాణ్ అంత బద్దలుకొట్టేది ఏంటి..? ఆయన జీవితానికి ఎన్ని సినిమాలు వచ్చాయి. ఏడాదికి ఒక సినిమా తీస్తారు. ఆ ఒక్క సినిమాకు మేం ఏం చేస్తాం.. అని ఘాటుగా సమాధానం ఇచ్చాడు. తెలుగు పరిశ్రమలో పదుల సంఖ్యలో సినిమాలు వస్తుంటే.. సంవత్సరానికి ఆయన తీసేది ఒక్క సినిమా దానికి మేం ఏం చేస్తాం అంటూ సమాధానం ఇచ్చాడు. ఇండస్ట్రీకి ఆయనకు అస్సలు సంబంధం ఏంటి..? అని ప్రశ్నించారు. పరిశ్రమలో కూడా అతడు ఒక నటుడు మాత్రమే అన్నారు. అతడిని సినిమాల్లో గానీ.. ఇటు రాజకీయంలో గానీ.. ఎలాంటి టార్గెట్ చేయడం లేదు.. అతడంటే మాకెందుకు భయం అంటూ చెప్పాడు మంత్రి పేర్ని నాని.
ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…
దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…
జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…
ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…
ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…
విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…