Prabhas: బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి అన్ స్టాపబుల్ సీజన్ 2 కార్యక్రమం ఇప్పటికే నాలుగు ఎపిసోడ్లు పూర్తి అయింది. ఇకపోతే తాజాగా ఈ కార్యక్రమం నుంచి వదిలిన ప్రోమో ద్వారా ఈ కార్యక్రమంలో టాలీవుడ్ బాహుబలి ప్రభాస్ పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇలా బాలకృష్ణ టాప్ షోకి ప్రభాస్ రావడంతో ఈ కార్యక్రమం పై ఎన్నో అంచనాలు పెరిగాయి.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభాస్ ను ఎలాంటి ప్రశ్నలు అడగబోతున్నారు వాటికి ప్రభాస్ ఎలాంటి సమాధానాలు చెప్పనున్నారనే ఆత్రుత ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది. ముఖ్యంగా ప్రభాస్ పెళ్లి గురించి బాలయ్య ఈ కార్యక్రమంలో ప్రశ్నిస్తారని చాలామంది భావిస్తున్నారు. ఇక అనుష్కతో ప్రభాస్ కు ఉన్న రిలేషన్ గురించి కూడా ఈ కార్యక్రమంలో బాలకృష్ణ ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
ప్రభాస్ బాలకృష్ణ అడిగే ఈ ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు చెప్పనున్నారు అనే విషయంలో ఆత్రుత నెలకొంది. ఇక ప్రభాస్ తన పెదనాన్న రాజు మరణం తర్వాత ఆయనతో అనుబంధం గురించి కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ప్రభాస్ పాన్ ఇండియా స్థాయిలో వరుస సినిమాలలో నటిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లను కూడా తెలియచేయునున్నట్టు తెలుస్తుంది. అతి త్వరలోనే ఈ కార్యక్రమం ప్రసారం కానున్నట్టు సమాచారం.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్‌తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…