పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్‌కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అంచనా వేయడం అంత ఈజీ ఏం కాదు. బాహుబలి సినిమా తర్వాత ప్రపంచ వ్యాప్తంగా స్టార్‌డమ్ సంపాదించి గ్లోబల్ ఐకాన్‌గా నిలిచారు రెబల్ స్టార్ ప్రభాస్. ఇక అభిమానులు ఆయనపై ఉన్న ప్రేమను, క్రేజ్‌ను చూపించాల్సిన సమయం ఆసన్నమైందన్నట్టు ప్రభాస్ పుట్టినరోజు వేడుకలను అంబరాన్నంటేలా అంతటా చాలా సందడిగా జరిపారు.
మరికొన్ని చోట్ల ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు.. డ్యాన్సులు చేస్తూ, పటాసులు కాలుస్తూ ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ అక్కడి వాతావరణాన్నే మార్చేశారు. ప్రజానికమే కాదు ప్రముఖ సెలబ్రెటీలు సైతం ప్రభాస్‌కు శుభాకాంక్షలు చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు, ట్వీట్‌లు చేశారు.
ఓ వైపు వెండితెరపై ప్రేక్షకులను అలరిస్తూనే….మరోవైపు బాక్సాఫీస్ రికార్డులు తిరగేస్తున్న ఈ రెబల్ స్టార్. ప్రతి సినిమాలో సరికొత్త లుక్ లో కనిపించే ప్రయత్నం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక బాహుబలితో తన సత్తా హాలీవుడ్ వరకు చాటాడు ప్రభాస్. భారతీయ ప్రేక్షకులతో సాహో అనిపించిన ప్రభాస్ 1979 అక్టోబర్ 23న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు లో జన్మించారు. ప్రభాస్ అసలు పేరు ఉప్పలపాటి ప్రభాస్ రాజు. ఇకపోతే ఆయన మొగల్తూరులో కూడా ప్రభాస్ ఫ్యాన్స్ ఏ మాత్రం ఎవరికీ తీసి పోని విధంగా ర్యాలీ నిర్వహించి, కేక్ కట్ చేసి ఆయన బర్త్‌డేను కోలాహలంగా జరిపారు.
ఇదిలా ఉండగా గ్లోబల్ ప్రభాస్‌డే పేరుతో రాధేశ్యామ్ టీజర్‌లోని మ్యూజిక్‌ను ప్లే చేస్తూ రూపొందించిన ఫిల్టర్ ప్రస్తుతం నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. ప్రభాస్‌కు డెడికేట్ చేస్తూ తాజాగా రూపొందించిన ఆ ఫిల్టర్‌పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు .
‘బాహుబలి తాలిస్ ’ నుండి అద్బుతమైన పోస్టర్ల వరకు, ప్రభాస్ పచ్చబొట్లు వేయించుకోవడంతోపాటు ఇంకా మరెన్నో రకాల యాక్టివిటీస్ తో తమ ఫేవరేట్ స్టార్ హీరోకు ప్రతీ సంవత్సరం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు రెడీ అవుతుంటారు అభిమానులు. ఇటీవలే రాధేశ్యామ్ నుంచి విక్రమాదిత్య పోస్టర్ బయటకు వచ్చింది. యంగ్ రెబల్ స్టార్ ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్టులు ఆదిపురుష్, సలార్, ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్‌లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని ఆస్తుల…