ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం హాట్ హాట్ గా సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఒక టిడిపి నేత జూనియర్ ఎన్టీఆర్ గురించి చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ లతో చనువుగా ఉంటారు అన్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే టీడీపీ నేత వల్లభనేని వంశీ మీద ఆరోపణలు చేశారు.ఆంధ్రప్రదేశ్ లోని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ తెలుగులో నిర్మాతగా పలు సినిమాలు చేశారు. 2009వ సంవత్సరంలో కోదండరామి రెడ్డి దర్శకుడిగా ముమైత్ ఖాన్ హీరోయిన్ గా రూపొందిన పున్నమినాగు సినిమాతో ఆయన నిర్మాతగా మారారు.
ఆ తర్వాత 2010వ సంవత్సరంలో వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందిన అదుర్స్ సినిమాకు వల్లభనేని వంశీ మోహన్, కొడాలి నాని ఇద్దరూ కలిసి నిర్మాతలుగా వ్యవహరించారు.ఇక గతంలో వల్లభనేని వంశీ మోహన్ రాజకీయ నేత, సినీ నిర్మాతగా ఉన్న పరిటాల రవి దగ్గర అనుచరుడిగా ఉండేవారు.
అయితే పరిటాల రవి చనిపోయిన సమయంలో ఆయన ఆస్తులు కాజేశారని టిడిపి అధికార ప్రతినిధి సూర్యప్రకాష్ ఆరోపించారు. అలాగే నమ్మి సినిమా చేసిన ఎన్టీఆర్ ను కూడా ఒక ల్యాండ్ విషయంలో వల్లభనేని వంశీ మోహన్ మోసం చేశారని ఆయన ఆరోపించారు. ఇక గతంలో కూడా కొడాలి నాని ఎన్టీఆర్ మధ్య ల్యాండ్ ఈ విషయంలోకొద్దిగా తేడాలు వచ్చాయని పెద్దఎత్తున ప్రచారాలు జరిగాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…