Categories: FeaturedMovie News

ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో ‘ట్యాక్సీ’ టైటిల్ లోగో విడుదల

హరీష్ సజ్జా దర్శకత్వంలో తాజాగా రూపొందుతున్న చిత్రం ట్యాక్సీ. ఈ సినిమాతో త్రివిక్రమ్ శ్రీనివాస్ వద్ద పలు సినిమాలకు దర్శకత్వం శాఖలో పని చేసిన హరీష్ సజ్జా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఇందులో వసంత్ సమీర్ పిన్నమ రాజు, అల్మాస్ మోటివాలా, సూర్య శ్రీనివాస్ , సౌమ్య మీనన్ , ప్రవీణ్ యండమూరి, సద్దాం హుస్సేన్, నవీన్ పండిత ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమాను హెచ్ అండ్ హెచ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై హరిత సజ్జా నిర్మిస్తున్నారు.బిక్కి విజయ్ కుమార్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాకు మార్క్ రాబిన్ సంగీతాన్ని అందిస్తుండగా, ఉరుకుండా రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇక ఆనంద్ పల్లకీ విఎఫ్ఎక్స్ అందిస్తుండగా, తీసి ప్రసన్న ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.

ఒక వైవిధ్యమైన కథాంశంతో సస్పెన్స్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు అలాగే త్రిల్లింగ్ ఎపిసోడ్స్ ఉంటాయని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. తాజాగా ఈ చిత్రానికి టైటిల్ లోగో పోస్టర్ ను ఆవిష్కరించారు.

ఇందులో ఒక గన్ పై కారు ఉంది, అలాగే బ్యాక్ గ్రౌండ్ వైజాగ్ మ్యాప్ కూడా కనిపిస్తోంది. ఈ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. లవ్ స్టోరీ సినిమాకు ఫైట్స్ కంపోజ్ చేసిన బిజే శ్రీధర్ ఈ సినిమాకు ఫైట్ కంపోజ్ చేస్తున్నారు. ఈ సినిమా కేవలం స్త్రీల సినిమాలు ఇష్టపడే వారికి మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు అలరించే అంశాలతో రూపొందుతోంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

2 days ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

2 days ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

2 days ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

2 days ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

2 days ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

2 days ago