Prabhas: టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు.ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న ప్రభాస్ అనంతరం తన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే చేస్తూ ఎంతో ఆదరాభిమానాలను సొంతం చేసుకున్నారు. ఇకపోతే ప్రభాస్ కి బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా విపరీతమైన ఆదరణ ఉంది.
ఈ క్రమంలోనే ప్రభాస్ క్రేజ్ చూసినటువంటి బాలీవుడ్ హీరోలు ఎలాగైనా ప్రభాస్ రికార్డులను చెరిపేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోలుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఖాన్స్, కపూర్స్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రభాస్ ను టచ్ చేయలేకపోతున్నారని ఆయన రికార్డులను కొల్లగొట్టలేకపోతున్నారని తెలుస్తోంది.
తాజాగా షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమా నుంచి బిగ్ అప్డేట్ విడుదల చేశారు.నవంబర్ రెండవ తేదీ షారుక్ పుట్టినరోజు కావడంతో ఆయన నటిస్తున్నటువంటి ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు.షారుక్ ఖాన్ పఠాన్ సినిమా టీజర్ ప్రభాస్ ఆది పురుష్ టీజర్ రికార్డును బ్రేక్ చేస్తుందని భావించారు. అయితే షారుఖ్ ఖాన్ ప్రభాస్ ను బీట్ చేయలేకపోయారని తెలుస్తోంది.
ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమా టీజర్ విడుదలైన 24 గంటలలో 68.91 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. అదేవిధంగా షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమా నుంచి విడుదలైనటువంటి టీజర్ 24 గంటలలో 17.1 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఇలా షారుఖ్ ఖాన్ సైతం ప్రభాస్ రికార్డులను టచ్ చేయలేకపోయారంటూ ప్రభాస్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…