Prabhas : బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత ప్రతి ఒక్క సినిమాని కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.ఈ విధంగా పాన్ ఇండియా స్థాయిలో వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ ఈమధ్య కాలంలో బయట ఈవెంట్లకు వెళ్లిన ప్రతిసారి కాస్త వింతగా కనిపిస్తున్నారు.
సినిమా ఈవెంట్ లో లేదా ఏదైనా కార్యక్రమాల నిమిత్తం బయటకు వచ్చినటువంటి ప్రభాస్ తలకు క్యాప్ పెట్టుకొని కనిపిస్తున్నారు. ఇలా ప్రభాస్ తలకు క్యాప్ పెట్టుకోవడంతో ఆయన లుక్ పట్ల విమర్శలు వచ్చాయి. ప్రభాస్ ఏంటి ఇలా క్యాప్ పెట్టుకుని ఉన్నారంటూ అభిమానులు పలు సందేహాలను వ్యక్తం చేశారు.
ఇకపోతే ప్రభాస్ ఒకసారి కాదు ఇలా బయటకు వెళ్లిన ప్రతిసారి క్యాప్ ఎందుకు పెట్టుకుంటున్నారనే విషయం గురించి సందేహాలను వ్యక్తం చేయగా తాజాగా ప్రభాస్ ఇలా క్యాప్ పెట్టుకోవడానికి కారణమేంటో తెలిసిపోయింది.సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ప్రభాస్ ఇలా క్యాప్ పెట్టుకొని బయటకు వెళ్లడానికి గల కారణం తన సినిమాలేనని తెలుస్తోంది.
ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తన సినిమాలలో తన లుక్ తెలియకుండా ఉండడం కోసం ఇలా బయటకు వెళ్లిన ప్రతిసారి క్యాప్ పెట్టుకుంటున్నారని,గతంలో తన సినిమాల విషయంలో జరిగిన పొరపాటు ఇప్పుడు జరగకుండా ఉండడం కోసమే ఇలా క్యాప్ ధరించి వెళుతున్నారని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…