సినిమా హీరోలకు ఫ్యాన్స్ అనే వారు ఉంటారు. కానీ ఆ ఫ్యాన్స్ అనేది సినిమా పరంగానే ఉండాలి కానీ.. పర్సనల్ వరకు వెళ్లకూడదు. కానీ ఇక్కడ ఓ ప్రభాస్ అభిమాని చేసిన పనికి ప్రతీ ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకు అతడు ఏం చేశాడో తెలుసా.. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం రాధేశ్యామ్.
ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ ఎప్పుడో పూర్తి అయింది.. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఒక టీజర్ వదిలారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్ డేట్ లేదు. దీంతో ఓ అభిమానికి ఈ విషయం తీవ్రంగా కలచి వేసింది.
ఏకంగా సూసైడ్ నోట్ రాసేశాడు. తన అభిమాన హీరోకు సంబంధించి ఒక్క అప్ డేట్ ఇవ్వడం లేదు.. దసరా పోయింది.. దీపావళి పోయింది.. ప్రతీ ఒక్క హీరోకు సంబంధించి అప్ డేట్లు వస్తున్నాయి..కానీ మా అభిమాన హీరో ప్రభాస్ కు సంబంధించి మాత్రం అప్ డేట్ రావట్లేదని సూసైడ్ నోట్ రాశాడు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తాను ఏనాడు లెటర్ రాయలేదని.. మొదటిసారి లెటర్ రాస్తున్నానని అతడు మొదలు పెట్టాడు. కలలో కూడా ఇలాంటి లెటర్ రాయాల్సి వస్తుందని అనుకోలేదు.. నా చావుకు కారణం యూవీ క్రియేషన్స్ మరియు దర్శకుడు రాధాకృష్ణ కుమార్ అంటూ అతడు ఆ లెటర్ లో పేర్కొన్నాడు. సంక్రాంతి కానుకగా థియేటర్లో వచ్చే ఈ రాధేశ్యామ్ ఫిల్మ్ కు సంబంధించి ఏ విషయాలు తెలియకపోవడంతో అతడు మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. అయితే నెటిజన్లు మాత్రం ఆ అభిమానని తప్పు పడుతున్నారు. ప్రాణాలు తీసుకునే దాక అభిమానం ఉండొద్దని హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…