100 రోజుల ఫంక్షన్ లో జ్ఞాపికలకు బదులుగా గొడ్డల్లను అందజేసిన ప్రభాస్ సినిమా ఏంటో తెలుసా..!!

పెదనాన్న కృష్ణంరాజు లాగా హైటు మరియు హ్యాండ్సమ్ హీరో ప్రభాస్. 2002 ఈశ్వర్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ప్రభాస్, మొదట్లో తన నటన మరియు సంభాషణల్లో కొంత తడబడిన అటు తర్వాత 2003 లో వచ్చిన “రాఘవేంద్ర” చిత్రంతో కొంత మార్పు కనబడింది. ఆ తర్వాత 2004 లో “వర్షం” సినిమాతో ప్రభాస్ లో కొంత యాక్టింగ్ లో మెచ్యూరిటీ వచ్చేసింది. ఆ తర్వాత అడవి రాముడు, చక్రం సినిమాలు కొంత నిరాశ పరిచినా తిరిగి “చత్రపతి” లాంటి బ్లాక్ బస్టర్ తో ప్రభాస్ తన ఉనికిని కాపాడుకుని.. 2005లో బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మాణం, రాజమౌళి దర్శకత్వంలో ఛత్రపతి చిత్రం విడుదలయ్యింది.

100 రోజుల ఫంక్షన్ లో జ్ఞాపికలకు బదులుగా గొడ్డల్లను అందజేసిన ప్రభాస్ సినిమా ఏంటో తెలుసా..!!

ప్రభాస్, శ్రీయ హీరో, హీరోయిన్ గా నటించగా, భానుప్రియ, కోట శ్రీనివాసరావు, షఫీ ప్రధాన పాత్రల్లో కనిపించారు. దర్శక ధీరుడు రాజమౌళి, రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన తొలిచిత్రం ఇదే కావడం విశేషం. మదర్ సెంటిమెంట్ తో రూపుదిద్దుకున్న హై వోల్టేజ్ యాక్షన్ చిత్రం. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ ప్రభాస్ అభిమానులకే కాదు మిగిలిన ప్రేక్షకులకు కూడా బాగా నచ్చుతుంది. రాజమౌళి చిత్రాల్లో తరుచు విలన్ గా కనిపించే ప్రదీప్ రావత్ ఈ సినిమాలో కూడా అదే పాత్రలో కనిపించారు.

“వాడు పోతే వీడు..వీడు పోతే నేను.. నేను పోతే..” అని ఆవేశపూరితంగా ప్రభాస్ చెప్పిన డైలాగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా ప్రభాస్ కు కమర్షియల్ బ్రేక్ ఇచ్చిన చిత్రంగా పేర్కొనవచ్చు. అలనాటి నటి భానుప్రియ, ప్రభాస్ కు తల్లి పాత్రను పోషించగా షఫీ మరో కొడుకుగా నటించారు. “స్టూడెంట్ నెంబర్ వన్” చిత్రం చూసిన ప్రభాస్ కు రాజమౌళి పై పెద్దగా అంచనాలు పెట్టుకోలేదు. కానీ ఈ చిత్ర విజయంతో రాజమౌళిపై ఉన్న సందేహాలు కాస్త పటాపంచలయ్యాయి. 8 కోట్లతో నిర్మించబడిన ‘ఛత్రపతి’ విడుదలై ఘన విజయం సాధించడంతో దాదాపు 30 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

తెలంగాణ నేపథ్యంలో వచ్చిన “వర్షం” సినిమా లవర్ బాయ్ గా ప్రభాస్ కు పేరు తెచ్చినప్పటికీ.. మసాలా హంగులతో రూపొందించిన చత్రపతి ప్రభాస్ సినీ కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రంగా పేర్కొనవచ్చు. అయితే ఈ మూవీ మేకర్స్ ఛత్రపతి 100 రోజుల ఫంక్షన్ లో ఆర్టిస్టులకు, టెక్నీషియన్లకు జ్ఞాపికలకు బదులుగా గొడ్డల్లను అందజేయడం జరిగింది. అప్పట్లో ఇది సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.