బాహుబలి తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి తెలియజేసిన సినిమా.. ఆ సినిమాతో రెబల్ స్టార్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారారు. దేశవ్యాప్తంగా ఎనలేని క్రేజ్ సంపాదించుకున్నారు. ఈతరువాత విడుదలైన సాహో మూవీతో మరో హిట్ కొట్టి తన పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ను పదిలం చేసుకున్నారు. ఇటు మూవీలతోనే కాకుండా తన వ్యక్తిత్వం, తన గ్రౌండ్ టూ ఎర్త్ లా ఉండే గుణం అందరికి నచ్చుతుంది.
ఎంతో పెద్ద యాక్టర్ అయినా తన తోటి కళాకారులతో, టెక్నీషియన్లతో ఎంతో స్నేహంగా ఉంటారు ప్రభాస్. ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ’ఆదిపురుష్‘ ముగింపుకు చేరింది. దీంతో ప్రభాస్ తన టెక్నీషియన్లకు మరవలేని గిఫ్టులు ఇచ్చి.. ఆశ్చర్యానికి గురి చేశాడు.
మూవీ యూనిట్ కి ’రాడో రిస్ట్ వాచ్‘ లు ఇచ్చాడు. దీంతో మూవీ టెక్నీషియన్లలో ఒకరు ప్రభాస్ ఇచ్చిన గిఫ్టును సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో నెటిజన్లు ప్రభాస్ ది ఎంత మంచి మనసు అంటూ పొగుడుతున్నారు. గతంలో కూడా ప్రభాస్ తన జిమ్ ట్రైనర్ కు రూ. 73 లక్షల విలువైన రేంజ్ రోవర్ కారును గిఫ్టుగా ఇవ్వడం తెలిసిందే..
ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో ఆదిపురుష్ పౌరాణిక చిత్రం చేస్తున్నాడు. దీనికి ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్ నటిస్తున్నారు. దీంతో పాటు ప్రాజెక్ట్ కే అనే మరో ప్యాన్ ఇండియా మూవీని ప్రభాస్ ప్రస్తుతం లైన్లో పెట్టాడు. దీంట్లో హీరోయిన్ గా దీపికా పదుకొనే చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…