మంచి మనసు చాటుకున్న ప్రభాస్ .. ఖరీదైన గిఫ్ట్ లు బహుమతిగా ఇచ్చిన ప్రభాస్.. ఎవరికంటే..

0
249

బాహుబలి తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి తెలియజేసిన సినిమా.. ఆ సినిమాతో రెబల్ స్టార్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారారు. దేశవ్యాప్తంగా ఎనలేని క్రేజ్ సంపాదించుకున్నారు. ఈతరువాత విడుదలైన సాహో మూవీతో మరో హిట్ కొట్టి తన పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ను పదిలం చేసుకున్నారు. ఇటు మూవీలతోనే కాకుండా తన వ్యక్తిత్వం, తన గ్రౌండ్ టూ ఎర్త్ లా ఉండే గుణం అందరికి నచ్చుతుంది.

ఎంతో పెద్ద యాక్టర్ అయినా తన తోటి కళాకారులతో, టెక్నీషియన్లతో ఎంతో స్నేహంగా ఉంటారు ప్రభాస్. ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ’ఆదిపురుష్‘ ముగింపుకు చేరింది. దీంతో ప్రభాస్ తన టెక్నీషియన్లకు మరవలేని గిఫ్టులు ఇచ్చి.. ఆశ్చర్యానికి గురి చేశాడు.

మూవీ యూనిట్ కి ’రాడో రిస్ట్ వాచ్‘ లు  ఇచ్చాడు. దీంతో మూవీ టెక్నీషియన్లలో ఒకరు ప్రభాస్ ఇచ్చిన గిఫ్టును సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో నెటిజన్లు ప్రభాస్ ది ఎంత మంచి మనసు అంటూ పొగుడుతున్నారు. గతంలో కూడా ప్రభాస్ తన జిమ్ ట్రైనర్ కు రూ. 73 లక్షల విలువైన రేంజ్ రోవర్ కారును గిఫ్టుగా ఇవ్వడం తెలిసిందే..

ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో ఆదిపురుష్ పౌరాణిక చిత్రం చేస్తున్నాడు. దీనికి ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్ నటిస్తున్నారు. దీంతో పాటు ప్రాజెక్ట్ కే అనే మరో ప్యాన్ ఇండియా మూవీని ప్రభాస్ ప్రస్తుతం లైన్లో పెట్టాడు. దీంట్లో హీరోయిన్ గా దీపికా పదుకొనే చేస్తున్నారు.