దీపికా పదుకొణె , ప్రభాస్ జంటగా నటిస్తోన్న రాబోయే చిత్రం ప్రాజెక్ట్ K.దీనిలో అబితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ K కు సంబంధించి షూటింగ్ ఇప్పటికే ప్రారంభించారు. దీనికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. ప్రాజెక్ట్ K అనేది సైన్స్ ఫిక్షన్ చిత్రానికి తాత్కాలిక టైటిల్ అనే విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్ పతాకంపై భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.
ఇటీవల సినిమా సెట్స్ నుండి ఒక ప్రత్యేక వీడియోను వైజయంతీ మూవీస్ ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఆ వీడియోలో ప్రభాస్, దీపికా పదుకొణె చేతులు పట్టుకున్నట్లు కనిపించింది. అయితే వారి ముఖాలు మాత్రం కనిపించడం లేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదిలా ఉండగా.. ఈ సినిమాకు సంగీత దర్శకుడి విషయంలో ఓ న్యూస్ బయటకు వచ్చింది.
దానికి సంబంధించి తాజాగా క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా మిక్కీ జె. మేయర్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇతడు సంగీత దర్శుకుడిగా ఇంత వరకు భారీ బడ్జెట్ సినిమాలను చేయలేదు. అయితే ఇలా అతడిని ఈ సినిమా నుంచి తప్పించారని వార్తలు వచ్చాయి. అతడికి బదులు మరో మ్యూజిక్ డైరెక్టర్ ను సంగీత దర్శకుడిగా తీసుకున్నట్లు.. అనేక వార్తలు వచ్చాయి.
వరంగల్ లో శ్యామ్ సింగరాయ్ ప్రి రిలీజ్ ఈవెంట్లో మిక్కీ మాట్లాడుతూ.. ప్రస్తుతం తాను ప్రాజెక్ట్
ప్రాజెక్టు K కు సంగీత దర్శకుడిగా కన్‌ఫర్మ్ అయినట్లు తెలిపాడు. ఇక అంతకు ముందు వచ్చిన వార్తలు అన్నీ ఫేక్ అని తెలిసిపోయింది. ఇలా రూమర్స్ కు చెక్ పెట్టినట్లు అయింది. ఇటీవల దీపికా పదుకొణె ప్రాజెక్ట్ కే షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చింది . ఈ షెడ్యూల్‌లో దీపిక, ప్రభాస్‌ల మధ్య సినిమాలోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ప్రముఖ స్టూడియోలో భారీ సెట్ వేసి షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…