Prabhas: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా కొనసాగుతూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సెలబ్రిటీలు వారి వ్యక్తిగత జీవితంలో కూడా చాలా రిచ్ గానే జీవిస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే వారు ఉపయోగించే ప్రతి వస్తువు కూడా బ్రాండెడ్ అయి ఉండాలని అలాగే అలాంటి వస్తువుల కోసం బాగానే ఖరీదు చేసి కొనుగోలు చేస్తుంటారు.
తాజాగా డార్లింగ్ ప్రభాస్ బాలయ్య అన్ స్టాపబుల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాధారణంగా ప్రభాస్ ఎక్కడ కూడా ఏ కార్యక్రమాలలోనూ కనిపించరు. కేవలం తన సినిమా ఈవెంట్లకు మాత్రమే హాజరవుతూ ఉంటారు. అలాంటిది బాలయ్య టాక్ షోలో బాహుబలి సందడి చేయనున్నారని తెలియడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు.
ఇక బాలకృష్ణ టాక్ షోలో ప్రభాస్ తో పాటు గోపీచంద్ కూడా పాల్గొనబోతున్నట్లు తాజాగా విడుదల చేసిన ప్రోమో ద్వారా తెలుస్తుంది.ఇకపోతే ఈ కార్యక్రమానికి ప్రభాస్ ధరించిన షర్ట్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. బాలకృష్ణ టాక్ షోలో ప్రభాస్ పసుపు ఎరుపు నీలం గీతలు కలిగినటువంటి గళ్ళ చొక్కా ధరించారు.
ఈ క్రమంలోనే ప్రభాస్ ధరించిన షర్టు ఖరీదు ఎంత ఉంటుందని పెద్ద ఎత్తున నేటిజన్స్ ఆరా తీస్తున్నారు. ఇకపోతే ప్రభాస్ ధరించిన ఈ షర్ట్ ఖరీదు 115 పౌండ్స్. అంటే.. ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 11,618/- అని తెలియడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ ప్రభాస్ ను ఎలాంటి ప్రశ్నలు వేస్తారు. ప్రభాస్ వాటికి ఏ విధమైనటువంటి సమాధానాలు చెబుతారనే విషయం గురించి ఆత్రుత నెలకొంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…