Radhe Shyam Trailer: మా హీరో మళ్లీ హిట్ కొట్టాడు..అంటూ అభిమానుల సందడి..!
Radhe Shyam Trailer: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మచ్ అవైటెండ్ మూవీ రాధేశ్యామ్. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. బాహుబలి, సాహోల తరువాత పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ మరోసారి రాధేశ్యామ్ మూవీలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మించారు.
జిల్ మూవీ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ సాహో తరువాత చేస్తున్న సినిమాపై భారీగా అంచానాలు పెరిగిపోయాయి. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిన ఈ సినిమాపై అన్ని సినీ ఇండస్ట్రీల్లో భారీగా క్రేజ్ ఏర్పడింది. దీనికి అనుగుణంగానే మూవీ టీం ప్రమోషన్లను వేగవంతం చేస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ మూవీపై చర్చ జరుగుతోంది.
ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫారెన్ బ్యాక్ డ్రాప్ లో సాగిన ఈసినిమాలో ప్రభాస్ లవర్ గా పూజా హెగ్డే నటిస్తోంది. మహాజ్ఞాని అయిన పరమహంస పాత్రలో కృష్ణం రాజు కనిపించారు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ స్థాయిలో జరిగింది. నవీన్ పోలిశెట్టి హోస్ట్ వ్యవహరించిన ఈ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది.
దేశ నలుమూల నుంచి రెబల్ స్టార్ ఫ్యాన్స్ వచ్చారు. దాదాపు 40 వేల మంది ఈ ప్రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యారు. అభిమానుల సమక్షంలో గ్రాండ్ గా రాధేశ్యామ్ ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ ట్రైలర్ కు అభిమానుల నుంచి విశేష స్పందన వస్తోంది. మా హీరో మళ్లీ హిట్ కొట్టాడురా..అంటూ ఫ్యాన్స్ తెగ హంగామా చేస్తున్నారు.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…