Prabhas Seenu : పిల్లా నువ్వు లేని జీవితం, ఛత్రపతి, గబ్బర్ సింగ్, రామయ్య వస్తావయ్య వంటి సినిమాల్తో కమెడియన్ గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న శ్రీనివాస్, ప్రభాస్ శీను గానే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గబ్బర్ సింగ్ లో తన నటనకు మంచి ప్రశంసలే కాకుండా అవకాశాలు కూడా వచ్చాయి. అయితే సరైన ప్లానింగ్ కెరీర్ మీద పెట్టకపోవడం వల్ల ఆర్థికంగా కూడా బాగా నష్టపోయిన ప్రభాస్ శీను తన కెరీర్ మొదట్లో అనుభవాలను, అవమానాలను తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు. తనతో నటించిన నటుల గురించిన ఆసక్తికర విషయాలను పంచుకున్న శీను, బాలయ్య బాబు షూటింగ్ లో ఎలా ఉంటారు అలాగే అభిమానులు ఎన్నిరకాలుగా ఉంటారు అన్న విషయాలను పంచుకున్నారు.
కొట్టి సెల్ఫీ అడిగాడు… బాలయ్య బాబు షూటింగ్ తరువాత ఏడ్చాను…
సినిమాల్లోకి రాకముందు మనల్ని ఎవరూ గుర్తుపట్టి మాట్లాడించకపోయినా సినిమాల్లోకి వచ్చాక మాత్రం మన ఊరు అయితే చాలు బాగా క్లోస్ అన్నటు మాట్లాడిస్తారు కొంతమంది. అలాంటి వాళ్ళను చూస్తే నవ్వొస్తుంది. ఒక్కోసారి వచ్చి కొట్టి సెల్ఫీ దిగుతావా అని అడుగుతారు, నేనెందుకు నీతో సెల్ఫీ దిగుతా అంటే సెల్ఫీ తీసుకుందాం రా శీను అంటుంటారు బయట కూడా భలే కామెడీ నువ్వు అని వాళ్ళే నవ్వేసుకుంటారు, అలాంటి వాళ్ళను చూసినపుడు నవ్వొస్తుంది. ఒక సారి ట్రైన్ లో వెళ్తున్నపుడు ఒక వ్యక్తి వచ్చి గుర్తుపట్టావా అన్నాడు, నేను వెంటనే మెగాస్టార్ కదా నువ్వు అని అడిగితే ఒక సెల్ఫీ ఇస్తావా అని మళ్ళీ అడిగాడు. ఫోటో తీసుకున్నాక ఇంకా పాత కారు ఉందా అమ్మేసావా అంటూ ఏదో బాగా పరిచయస్తుడి లాగా అడగాడు, అలాంటి వాళ్ళను చూస్తే బాగా నవ్వొస్తుంది.
గోదావరి వాళ్ళు మరీ వెటకారంగా మాట్లాడి నవ్విస్తారు అంటూ ఆయన ఫ్యాన్స్ తో అనుభవాలను పంచుకున్నారు. ఇక హీరో బాలకృష్ణ గురించి అడుగగా ఆయనతో మొదటి సారి పనిచేయాలన్నప్పుడు చాలా భయపడ్డాను, ఆయనకు కోపం ఎక్కువ అని కానీ సెట్స్ లోకి వెళ్ళాక ఆయన తో ఎంజాయ్ చేసినట్లు నవ్వుకున్నట్టు మరో హీరోతో నవ్వలేదు. నా జీవితంలో మరే హీరోతో అంత ఎంజాయ్ చేయలేదు అంటూ చెప్పారు. డిక్టేటర్ సినిమా షూటింగ్ అయిపోయాక ఏడుపొచ్చింది మళ్ళీ బాలకృష్ణ గారిని కలుస్తానా అని, అంత బాగా ఉంటారు ఆయన అంటూ ప్రభాస్ శీను చెప్పారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…