Categories: FeaturedMovie News

Senior Actress Jamuna : సావిత్రి మొదటిసారి దర్శకత్వం వహించిన సినిమాకు పనిచేసిన వారందరూ మహిళలే..కానీ ఆ చిత్రం ఊహించని పరాజయం. : జమున

Senior Actress Jamuna : 1960 ప్రారంభ దశకంలో రచయితగా నిర్మాతగా పనిచేసిన దుక్కిపాటి మధుసూదన్ రావు అనుకోకుండా ఒక సినిమాకి దర్శకత్వం వహించాల్సివచ్చింది. కృష్ణమూర్తి నిర్మాణ సారధ్యంలో మధుసూదన్ రావు దర్శకత్వం వహించిన “పదండి ముందుకు” చిత్రం 1962లో విడుదల అయింది. ఈ చిత్రంలో జమున, జగ్గయ్య హీరో, హీరోయిన్లుగా నటించారు.

సినిమా షూటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత సినిమా టెక్నికల్ వర్క్ కోసం దర్శకుడు డి.మధుసూదన్ రావు, గుమ్మడి, జమున కలిసి రష్యా వెళ్లారు. అక్కడ స్టూడియోస్ లో చిల్డ్రన్ స్టోరీతో కూడిన ఒక సినిమా చూశారు. ఆ సినిమాను డి. మధుసూదన్ రావు భార్యకు చూపించగా మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఆమె ఒక కథ రాశారు. అలా కథా రచయిత సరోజినీ, జమున వీళ్లంతా కలిసి ఒక సినిమా నిర్మిద్దాం అనుకున్నారు. అప్పటికి నటి సావిత్రి కెరియర్ మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది. వీరంతా బలవంతం చేయడంతో సావిత్రి వెళ్లి తన భర్త జెమినీ గణేషన్ తో విషయం చెప్పారు. ఆయన కొంత సమయం తీసుకుని ఆలోచించి దర్శకత్వం చేయమని చెప్పారు. అలా ఆమె దర్శకత్వం చేయడానికి ముందుకు వచ్చారు.

‘చిన్నారి పాపలు’ అనేది 1968లో వచ్చిన సినిమా. వీరమాచనేని సరోజిని రచించి, నిర్మించగా సావిత్రి దర్శకత్వం వహించింది. ఈ చిత్రంలో జమున, జగ్గయ్య, షావుకారు జానకి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది ఒక ధనవంతుడు గిరిజన అమ్మాయితో ప్రేమలో పడే కథ. వారు విడిపోయినప్పుడు ఈ జంట జీవితంలో సవాళ్లను ఎలా ఎదుర్కొంటుందో చెబుతుంది.

“చిన్నారి పాపలు” సావిత్రికి దర్శకురాలిగా తొలి చిత్రం. దీని సిబ్బందిలో ఎక్కువగా మహిళలే. దర్శకత్వం సావిత్రి, నిర్మాణం-రచన సరోజిని, సంగీత దర్శకత్వం పి.లీల, ఆర్ట్ డైరెక్టర్ మోహన, నృత్యాలు రాజసులోచన. ఇలా అత్యధికంగా మహిళలచే రూపొందించబడిన ఈ చిత్రం ఆగస్టు 14,1968లో బాక్సాఫీస్ ముందుకు వచ్చింది. అయితే మధుసూదన్ రావు భార్య సరోజినీ, నేను, షావుకారు జానకి మేమంతా తల 5000 రూపాయలు వేసుకొని సినిమా నిర్మించాలనుకున్నాం. సావిత్రి నాతో మాట్లాడుతూ.. చెల్లి ఈ సినిమాలో నువ్వు హీరోయిన్ గా నటించాలని కోరారు. ఆమె అడగడంతో నేను ఈ సినిమాలో హీరోయిన్ గా నటించాను. అంతా మహిళలచే రూపొందించబడిన ఆ మొదటి ప్రయోగం తీవ్రపరాజయాన్ని పొందింది. కనీసం ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ కూడా తిరిగి రాబట్ట లేకపోయింది. కానీ దర్శకురాలిగా సావిత్రికి మంచి పేరు వచ్చిందనడంలో సందేహం లేదని ఆ ఇంటర్వ్యూలో జమున చెప్పుకొచ్చారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

2 months ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

4 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

4 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago