Prabhas Seenu : పిల్లా నువ్వు లేని జీవితం, ఛత్రపతి, గబ్బర్ సింగ్, రామయ్య వస్తావయ్య వంటి సినిమాల్తో కమెడియన్ గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న శ్రీనివాస్, ప్రభాస్ శీను గానే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గబ్బర్ సింగ్ లో తన నటనకు మంచి ప్రశంసలే కాకుండా అవకాశాలు కూడా వచ్చాయి. అయితే సరైన ప్లానింగ్ కెరీర్ మీద పెట్టకపోవడం వల్ల ఆర్థికంగా కూడా బాగా నష్టపోయిన ప్రభాస్ శీను తన కెరీర్ మొదట్లో అనుభవాలను అవమానాలను తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు. తనతో నటించిన నటుల గురించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఎన్టీఆర్ ఆ సమయంలో ఫోన్ చేసి…
ప్రభాస్ శీను సినిమాల్లోకి రావడంతోనే ప్రభాస్ కి కేర్ టేకర్ గా ఉండేవాడు. అలా ఇండస్ట్రీలో పరిచయాలు పెంచుకుని సినిమా ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింవు తెచ్చుకున్న శీను అందరు హీరోలతో మంచి అనుబంధం కలిగి ఉన్నాడు. అలా శీను భార్య కి మొదటి సారి గర్భం పోయి అబార్షన్ జరిగితే బెంగళూరు కు ఎన్టీఆర్ టికెట్ వేయించి ఆమె వద్దకు పంపాడంటూ అలాగే సినిమా యూనిట్ తో మాట్లాడి పంపించాడని, కాల్ చేసి ధైర్యం చెప్పాడని శీను చెప్పారు. నేను వర్క్ చేసిన హీరోలందరూ నన్ను బాగా చూసుకున్నారంటు చెప్పాడు ప్రభాస్ శీను.
కన్నడ బృందావనం సినిమా చేసేటపుడు దర్శన్ గారు కూడా చాలా బాగా చూసుకున్నానరు అంటూ చెప్పారు. ఇక రాజమౌళి సినిమాలో నిజంగా దెబ్బలు తినడానికి కారణం ఏమిటి అని అడిగితే రాజమౌళి అంటే అలానే ఉంటుంది, సీన్ బాగా రావాలనప్పుడు ఎవరినైనా అంతే కష్టపెడతాడు. కానీ ఆ సినిమా వల్ల నాకు మంచి పేరు వచ్చింది అంటూ చెప్పారు ప్రభాస్ శీను.
భారతీయుల ఆహారపు అలవాట్లలో పెరుగుకు ప్రత్యేక స్థానం ఉంది. భోజనం చివరలో ఒక గిన్నె పెరుగు తింటే కడుపుకు హాయిగా…
ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంపదకు, శుభానికి, భద్రమైన పెట్టుబడికి ప్రతీకగా భావించే…
దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల్లో సమంత ఒకరు. తన నటన, కష్టపడి పనిచేసే తత్వం,…
ప్రపంచంలో కాఫీ ప్రియులు ఎన్నో రకాల కాఫీలను ఆస్వాదిస్తుంటారు. సాధారణ కాఫీ నుంచి ప్రత్యేక రకాల కాఫీల వరకు మార్కెట్లో…
పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…
జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…