Vakada Apparao : సీనియర్ నిర్మాత వాకాడ అప్పారావు ప్రొడ్యూసర్ గా ‘ఇంటి దొంగ’ సినిమాతో నిర్మాతగా మొదలై పలు చిత్రాలను నిర్మించారు. ఇక ఆ తరువాత ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న ఆర్బి చౌదరి గారితో పరిచయం ఏర్పడి ఆయనతో భాగస్వామి నిర్మాతగా మారి సినిమాలను నిర్మించారు. దాదాపు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ అలా పలు భాషలలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ లో సినిమాలను నిర్మించారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించిన సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థ ప్రస్తుతం సినిమాలను నిర్మించడం తగ్గించారు. ఇక సొంత బ్యానర్ లాగా ఆ సంస్థలో పనిచేసిన వాకాడ అప్పారావు గారు ప్రస్తుతం ఆ సంస్థ నుండి బయటకు వచ్చారు. ఇక ఈ విషయాలన్నింటిలోనూ ఆయన క్లారిటీ ఇచ్చారు.
సంస్థ నుండి అందుకే బయటకు వచ్చాను…
సూపర్ గుడ్ ఫిలిమ్స్ లో వర్కింగ్ పార్టనర్ గా ఉన్న వాకాడ అప్పారావు గారు ఆ సంస్థ నిర్మించిన ఎన్నో సినిమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉంటూ సినిమా లాభాలలో వాటా తీసుకున్నారు. ఇక ఆర్బి చౌదరి గారితో కూడా మంచి అనుబంధం ఉన్న ఆయన ఆ సంస్థ నుండి బయటకు ఎందుకు వచ్చారని అడుగగా రామ్ చరణ్ ఫోన్ చేసి ‘రచ్చ’ సినిమా చేసే సమయంలో పిలిచి సినిమా చేద్దాం మీకు అభ్యంతరం లేకపోతే కొణిదెల బ్యానర్ లో మీరు నిర్మాణ పనులు చూసుకోండి అని చెప్పారు.
ఇక అదే సమయంలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ లో ఏవి ప్రాజెక్ట్స్ లేకపోవడం తో వెళ్ళాను. ఇక ‘ఖైదీ నెంబర్ 150’ అలాగే ‘సైరా నరసింహారావు రెడ్డి’ కి పనిచేసాను. ఆర్బి చౌదరి గారితో ఎలాంటి విబేధాలు లేవు అంటూ చెప్పారు వాకాడ. ఇప్పుడు కూడా వాళ్ళ అబ్బాయి హీరో జీవా ఫోన్ చేసి మనం ఒక ప్రాజెక్ట్ చేద్దాం అని పిలిచాడు. త్వరలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ నుండి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం ఆర్బి చౌదరి గారితో ఎలాంటి విబేధాలు లేవు అని చెప్పారు. ఇక ఆర్బి చౌదరీ గారు చౌదరి కాదని, తెలుగు వారు కాదని, ఆయన రాజస్థాన్ కి సంబంధిచిన బ్రాహ్మిన్ అంటూ చెప్పారు. వాళ్ళు పూర్తిగా శాఖాహారులు అంటూ చెప్పారు.
భారతీయుల ఆహారపు అలవాట్లలో పెరుగుకు ప్రత్యేక స్థానం ఉంది. భోజనం చివరలో ఒక గిన్నె పెరుగు తింటే కడుపుకు హాయిగా…
ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంపదకు, శుభానికి, భద్రమైన పెట్టుబడికి ప్రతీకగా భావించే…
దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల్లో సమంత ఒకరు. తన నటన, కష్టపడి పనిచేసే తత్వం,…
ప్రపంచంలో కాఫీ ప్రియులు ఎన్నో రకాల కాఫీలను ఆస్వాదిస్తుంటారు. సాధారణ కాఫీ నుంచి ప్రత్యేక రకాల కాఫీల వరకు మార్కెట్లో…
పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…
జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…