Narasimha Raju : తెలుగులో జానపద హీరోగా బాగా గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో నరసింహ రాజు గారు ఒకరు. 1970 లలో అనేక జానపద సినిమాలలో నటించిన ఆయన విఠలాచార్య సినిమా ‘జగన్మోహిని’ ద్వారా సూపర్ హిట్ అందుకున్నారు. అప్పట్లో నరసింహ రాజు, హీరోయిన్ ప్రభ హిట్ పెయిర్ గా నిలిచారు. నరసింహ రాజు గారి తండ్రి దాన ధర్మాలు బాగా చేసి ఆస్తులన్నీ అయిపోగొట్టడం, ఇక సినిమాల మీద మక్కువతో నరసింహారాజు గారు మద్రాస్ వెళ్లి ప్రయత్నం చేయడంతో అవకాశాలు వచ్చాయి. ‘నీడలేని ఆడది’ వంటి సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన నరసింహ రాజు గారు, విఠలాచర్య గారి పరిచయంతో ఆయన కెరీర్ మారిపోయింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం గ్రామానికి చెందిన నరసింహరాజు గారు దాదాపు గా 110 సినిమాల్లో నటించారు. ఆంధ్ర కమల్ హాసన్ గా బిరుదు తెచ్చుకున్న నరసింహ రాజు గారు సినిమాల్లో అవకాశాలు తగ్గాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించారు. ఇక పలు సీరియల్స్ లో కూడా నటించారు. ముఖ్యంగా పలు తమిళ సీరియల్స్ లో నటించి పేరు తెచ్చుకున్నారు.
ఆదిపురుష్ టీజర్ పై హాట్ కామెంట్స్…
ప్రస్తుతం వస్తున్న సినిమాలను కూడా చూస్తూ ఉంటాను అంటూ తాజాగా నరసింహారాజు గారు ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అందరి హీరోల నటన బాగుందంటూ చెప్పారు, ఫిటినెస్ మెయిన్టైన్ చేస్తూ డాన్స్, నటన అన్నింటిలోనూ కష్ట పడుతూ ప్రతి సినిమాకు కొత్తదనం చూపిస్తున్నారు అంటూ ప్రశంసించారు. ఇక ఇటీవలే విడుదల అయిన ఆదిపురుష్ టీజర్ మీద ఆయన అభిప్రాయాన్ని అడుగగా అజానుభాహుడుగా ప్రభాస్ రాముడిగా బాగున్నాడని కాకపోతే సినిమా బృందం కొత్తగా రామాయణం చూపించాలని అనుకుంటున్నారు వారి ప్రయత్నం ఎలా ఉండబోతోందో తెలియదు.
ఇన్నేళ్లు చూసిన రాముడుకి ఇప్పుడు గడ్డం, మీసం పెట్టడం వల్ల కొత్తగా అనిపిస్తోంది కానీ మనకు తెలియదు కదా అసలు రాముడు ఎలా ఉంటాడో. ఇక సినిమా త్వరలో విడుదల కాబోతోంది కాబట్టి సినిమాలో పెద్దగా మార్పులు రావు, వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా చూపిస్తే సరిపోతుంది. నచ్చిన వాళ్ళు చూస్తారు, కొత్త ప్రయత్నం చేసినపుడు ఈ రిస్క్ తప్పదు అంటూ అభిప్రాయపడ్డారు.
భారతీయుల ఆహారపు అలవాట్లలో పెరుగుకు ప్రత్యేక స్థానం ఉంది. భోజనం చివరలో ఒక గిన్నె పెరుగు తింటే కడుపుకు హాయిగా…
ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంపదకు, శుభానికి, భద్రమైన పెట్టుబడికి ప్రతీకగా భావించే…
దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల్లో సమంత ఒకరు. తన నటన, కష్టపడి పనిచేసే తత్వం,…
ప్రపంచంలో కాఫీ ప్రియులు ఎన్నో రకాల కాఫీలను ఆస్వాదిస్తుంటారు. సాధారణ కాఫీ నుంచి ప్రత్యేక రకాల కాఫీల వరకు మార్కెట్లో…
పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…
జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…