Imandi Ramarao : అన్ స్టాపబుల్ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. ఆ ఒక్క షోతో ఆహా సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారి సంఖ్య బాగా పెరిగింది. ఇక రేటింగ్స్ లోనూ రికార్డులు సృష్టించింది అన్ స్టాపబుల్. సీజన్ వన్ ఆ రేంజ్లో హిట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఇక సెకండ్ సీజన్ కోసం ఫ్యాన్స్ మాత్రమే కాదు సగటు ప్రేక్షకుడు కూడా ఎదురుచూస్తున్నాడు. ఇక అన్ స్టాపబుల్ సీజన్ రెండు మొదటి ఎపిసోడ్ త్వరలో రాబోతోంది, దీనికి సంబంధించిన ప్రోమో కుడా విడుదల చేసారు. మొదటి ఎపిసోడ్ ఏకంగా తెలుగు దేశం అధినేత స్వయానా బాలయ్య కు బావ అయిన నారా చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్ లు వచ్చి సందడి చేసారు. ఇక ఈ షోలో ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాకుండా పొలిటికల్ టాక్స్ కూడా వచ్చాయి. ఇక వీటిపై సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు విశ్లేషించారు.
చంద్రబాబు ఈ షోతో అందరి నోళ్లు మూయించాడు…
ఇక షోలో సరదా సంభాషణల నడుమ వెన్నుపోటు అంశం కూడా చర్చకు వచ్చింది. బాలకృష్ణ బావ చంద్రబాబు నాయుడుని 1995 లో ఎన్టీఆర్ ను గద్దె దించి ఆయన సీఎం అవడం గురించి ప్రశ్నించారు. ఇక ఇది ప్రోమోకి హైలైట్ గా నిలిచింది. ఇక ఈ ఇష్యూ గురించి మాట్లాడుతూ చంద్రబాబు ఆరోజు మన నిర్ణయం తప్పా అంటూ బాలకృష్ణ ను అడగడం ప్రోమో లో చూపిస్తారు. ఇక దీన్ని గురించి ఇమంది గారు మాట్లాడుతూ ఇన్నేళ్లు వెన్నుపోటు అనే నిందను మోస్తున్న చంద్రబాబు నేడు ఆ విమర్శకు ఈ షో ద్వారా చెక్ పెట్టారనిపిస్తోంది.
ఆనాడు ఆయన ఆ నిర్ణయం తీసుకోకుంటే ఈనాడు తెలుగు దేశం పార్టీ ఉండేది కాదు అంటూ చెప్పారు. ప్రత్యర్థులు ఆయన మీద బురద జల్లాడానికి ఉపయోగించుకున్న అస్త్రం మాత్రమే అది కానీ నిజంగా ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీ ఎక్కాలని చంద్రబాబు ఇలా చేసుంటే ప్రజలు గ్రహిస్తారు. వెంటనే జరిగిన ఎన్నికలలో ఆయన్ను గెలిపించరు కదా అంటూ చెప్పారు. మొత్తానికి ఈ షో ద్వారా పొలిటికల్ హీట్ కూడా పెంచేసారు బావబావమర్థులు అంటూ చెప్పపారు ఇమంది గారు.
భారతీయుల ఆహారపు అలవాట్లలో పెరుగుకు ప్రత్యేక స్థానం ఉంది. భోజనం చివరలో ఒక గిన్నె పెరుగు తింటే కడుపుకు హాయిగా…
ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంపదకు, శుభానికి, భద్రమైన పెట్టుబడికి ప్రతీకగా భావించే…
దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల్లో సమంత ఒకరు. తన నటన, కష్టపడి పనిచేసే తత్వం,…
ప్రపంచంలో కాఫీ ప్రియులు ఎన్నో రకాల కాఫీలను ఆస్వాదిస్తుంటారు. సాధారణ కాఫీ నుంచి ప్రత్యేక రకాల కాఫీల వరకు మార్కెట్లో…
పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…
జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…