Producer Ram Sathyanarayana : మంచు ఫ్యామిలీ ఏం మాట్లాడినా మీమర్స్ కి పండగ. ఒక చిన్న ప్రెస్ మీట్ అయినా సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తారు ట్రోలర్స్, మీమర్స్. కావాలనే మా మీద బురద జల్లుతున్నారంటూ మంచి విష్ణు కూడా ఆరోపణలను చేసారు. ఒక స్టార్ హీరో కావాలనే మమ్మల్ని టార్గెట్ చేసి ట్రోల్స్ చేయిస్తున్నారు అంటూ మీడియా సమక్షంలో చెప్పారు. త్వరలో ఆ హీరో ఎవరో బయటపెడతానని చెప్పి ఆ స్టార్ హీరో ఆఫీస్ నుండే ఈ ట్రోల్స్ లాంటివి వస్తున్నాయంటూ చెప్పారు. ఇక ఈ ఇష్యూ గురించి సీనియర్ ప్రొడ్యూసర్ రామ్ సత్యనారాయణ మాట్లాడారు.
మా అధ్యక్షుడు కాబట్టి ఆయన తెలుసుకోగలరు…
రామ్ సత్యనారాయణ కృష్ణ గారితో మొదలు పెట్టి నేడు ‘ఐస్ క్రీమ్’ ‘పెళ్లి చూపులు’ వంటి సినిమాలకు నిర్మాత్తగా వ్యవహారించారు. ప్రస్తుతం సినిమాలను థియేటర్లలో చూడడానికి ప్రేక్షకులు రాకపోవడం గురించి మాట్లాడుతూ ఈ సోషల్ మీడియాలో రివ్యూల పేరుతో సినిమా విడుదల అవ్వగానే పెట్టే ఒపీనియన్ ను మూడు రోజులు ఆపగలిగితే సినిమా ఫలితం బాగుంటుంది. శుక్రవారం విడుదల అయితే సినిమా సోమవారం వరకూ రివ్యూ లు, రేటింగులు లేకపోతే చాలు సినిమాకు నష్టాలు తగ్గుతాయి.
ఒకవేళ సినిమా బాగోలేక పోతే అపుడు వసూళ్లు రావుకదా, కానీ ఒక సినిమా బాగుండి కావాలని నెగటివ్ ప్రచారం చేయిస్తే అపుడు సినిమాకు నష్టం వస్తుంది. ఈ మధ్య నెగెటివ్ ప్రచారం సినిమాలకే కాదు వ్యక్తులకు కూడా ఎక్కువైంది అంటూ చెప్పారు. మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆయన ఫ్యామిలీ మీద జరుగుతున్న ట్రోల్స్ గురించి మాట్లాడుతూ నిజంగానే ఒక స్టార్ హీరో దీన్ని వెనుక ఉన్నా అది ఎన్నో రోజులు దాగదు బయటికి వస్తుంది. ఆయన మా అసోసియేషన్ అధ్యక్షుడు, ఆయనకు అది ఇంకా సులువు ఎవరు చేసారో కనిపెట్టడం, ఇటీవలే ట్రోలర్స్ మీమర్స్ ను పిలిచి మీటింగ్ పెట్టి మరీ మాట్లాడారట. అందుకే ఇక జిన్నా సినిమా విషయంలో కాస్త ట్రోల్స్ తగ్గాయని అనిపిస్తోంది అంటూ అభిప్రాయపడ్డారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…