Pradeep : యాంకర్ గా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుని తానుంటే షో హిట్ అనేంత స్టార్ డమ్ తెచ్చుకున్న యాంకర్ ప్రదీప్ మాచిరాజు. రేడియో జాకీ గా మొదలైన కెరీర్ ఢీ రియాలిటీ షో, జీ టీవీ లో డ్రామా జూనియర్స్, వంటి షోస్ తో పాటు పలు ఈవెంట్లను చేస్తూ బిజీ యాంకర్ గా ఉన్నాడు ప్రదీప్. లేడీ యాంకర్స్ డామినేషన్ లో ఒకేఒక మేల్ యాంకర్ గా తనకంటూ ఒక ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు. అటు సినిమాల్లోను నటిస్తూ బాగా సంపాదిస్తున్నాడు ప్రదీప్.
ప్రదీప్ బుల్లితెర కు గుడ్ బై….
100% లవ్, అత్తారింటికి దారేది, జులాయి వంటి సినిమాల్లో నటించిన ప్రదీప్ ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాలో హీరోగా కనిపించాడు. అయితే సినిమా పెద్ద విజయం సాధించకపోయినా ఆ సినిమాలోని నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా పాట మాత్రం లాక్ డౌన్ లో బాగా ఫేమస్ అయింది. అయితే ప్రదీప్ ఇపుడు బుల్లితెరకు దూరమవుతున్నాడనే ప్రచారం జరుగుతోంది. డ్రామా జూనియర్స్ ప్రోమోలో ఆలీ ఈ మాట అనగానే ప్రోమో కట్ అవుతుంది. దీంతో ఇపుడు నెట్టింట్లో ఇదే టాపిక్. నీలి నీలి ఆకాశం పాటను డ్రామా జూనియర్స్ లో ఒక చిన్నారి పాడగా జడ్జిగా వ్యవహారిస్తున్న సునీత కూడా గొంతుకలిపారు.
ఇక ఆలీ కూడా కాస్త ఎమోషనల్ అయ్యారు మధ్యలో నువ్వు అలా నిల్చోని పిల్లలు, సునీత అలా పాడుతుంటే, ఇక ఇండస్ట్రీ నుంచి ప్రదీప్ వెళ్లిపోతున్నాడు.. అని అలీ అన్నారు. అక్కడికి ప్రోమో కట్ అవ్వడంతో ఇపుడు సోషల్ మీడియాలో దీన్ని గురించి చర్చ నడుస్తోంది. కొంతమంది ప్రదీప్ సినిమాల్లోకి వెళ్తున్నాడు అందుకే బుల్లితెర వదిలేస్తున్నాడు మంచిదే అని అంటుండగా … మరికొంత మంది ఇదంతా టీఆర్పి స్టంట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…